మాపు దాఁకా రేపకాడ మానఁజాల మింతే కాక
(॥పల్లవి॥)
మాపు దాఁకా రేపకాడ మానఁజాల మింతే కాక
పూపల నీ మతకము పుట్టించరానిది
(॥మాపు॥)
చేతికి విడె మియ్యఁగ సేసలెల్లాఁ జేయఁగాను
ఆతల నున్న మనసు యీతల నాయ
యీతీరు నీరాతిగుణ మెందాఁకాఁ దిప్పఁగ వచ్చు
నీతితోడ నీవలపు నీయంత లేనిది
(॥మాపు॥)
కన్నులెదుట నుండఁగ కవకవనవ్వఁగాను
మన్నించి నీవాకున మాట వెళ్లెను
పన్నుకొని నీతో నెట్టు బయలు వాఁకఁగ వచ్చు
పిన్న నాఁడు లేనివోజ పెద్దై తే నుండునా
(॥మాపు॥)
కందువకుఁ దియ్యంగాను కాఁగిట బిగించఁగాను
విందుల కూటమి వెల్ల విరు లాయను
అందపు శ్రీవేంకటేశ ఆలయించ నెట్టు వచ్చు
ముందువెనకల నిఁక మూసి దాఁచఁదగునా
(||pallavi||)
mābu dām̐kā rebagāḍa mānam̐jāla miṁte kāga
pūbala nī madagamu puṭṭiṁcharānidi
(||mābu||)
sedigi viḍĕ miyyam̐ga sesalĕllām̐ jeyam̐gānu
ādala nunna manasu yīdala nāya
yīdīru nīrādiguṇa mĕṁdām̐kām̐ dippam̐ga vachchu
nīdidoḍa nīvalabu nīyaṁta lenidi
(||mābu||)
kannulĕduḍa nuṁḍam̐ga kavagavanavvam̐gānu
manniṁchi nīvāguna māḍa vĕḽlĕnu
pannugŏni nīdo nĕṭṭu bayalu vām̐kam̐ga vachchu
pinna nām̐ḍu lenivoja pĕddai te nuṁḍunā
(||mābu||)
kaṁduvagum̐ diyyaṁgānu kām̐giḍa bigiṁcham̐gānu
viṁdula kūḍami vĕlla viru lāyanu
aṁdabu śhrīveṁkaḍeśha ālayiṁcha nĕṭṭu vachchu
muṁduvĕnagala nim̐ka mūsi dām̐sam̐dagunā