Maabu daamkaa rebagaada maadagu maadaadamgaanu

మాపు దాఁకా రేపకాడ మాటకు మాటాడఁగాను
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా రేపకాడ మాటకు మాటాడఁగాను
యేపునఁ దెగని పనికేల పెట్టే వాన

(॥మాపు॥)
నవ్వి నవ్వి మానేవు నడుమ నడుమ నీవు
జవ్వని యెవ్వతేమైనా సన్న సేసెనా
వువ్విళ్లూర నీనిజము వొరసి చూచే నింతే
యెవ్వరిందుకు గురయ్యే రేల పెట్టే వాన

(॥మాపు॥)
చెప్పి చెప్పి కొంకేవు సిగ్గులువడుతా నీవు
వుప్పటించ నీడ నెవ్వరున్నారు నీకు
రెప్పలెత్తి చూచి నిన్ను రేఁచి వెదకే నింతే
యెప్పటివాఁడవే నీవు యేల పెట్టే వాన

(॥మాపు॥)
ముట్టి ముట్టి చూచేవు మొరఁగి నాకుచములు
యిట్టె యెవ్వతెవైనా యీడువచ్చెనా
నెట్టన శ్రీవేంకటేశ నిరతి మెచ్చితి నింతే
యెట్టకేల కైనపనికేల పెట్టే వాన

(||pallavi||)
mābu dām̐kā rebagāḍa māḍagu māḍāḍam̐gānu
yebunam̐ dĕgani panigela pĕṭṭe vāna

(||mābu||)
navvi navvi mānevu naḍuma naḍuma nīvu
javvani yĕvvademainā sanna sesĕnā
vuvviḽlūra nīnijamu vŏrasi sūse niṁte
yĕvvariṁdugu gurayye rela pĕṭṭe vāna

(||mābu||)
sĕppi sĕppi kŏṁkevu sigguluvaḍudā nīvu
vuppaḍiṁcha nīḍa nĕvvarunnāru nīgu
rĕppalĕtti sūsi ninnu rem̐si vĕdage niṁte
yĕppaḍivām̐ḍave nīvu yela pĕṭṭe vāna

(||mābu||)
muṭṭi muṭṭi sūsevu mŏram̐gi nāgusamulu
yiṭṭĕ yĕvvadĕvainā yīḍuvachchĕnā
nĕṭṭana śhrīveṁkaḍeśha niradi mĕchchidi niṁte
yĕṭṭagela kainabanigela pĕṭṭe vāna