Maabu daamkaa nela nee manasu vachchidem jaalu

మాపు దాఁకా నేల నీ మనసు వచ్చితేఁ జాలు
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా నేల నీ మనసు వచ్చితేఁ జాలు
చేపట్టిన పని నీ చిత్తమే యెఱుఁగును

(॥వప॥)
మంతనాన నీ వాడినమాటలుగా నామతిలో
యెంతైనా నీపైకోపము హెచ్చనీనివి
పంతము నాకేమి దప్పెఁ బదవయ్య నీవు నన్ను
యింత వేడుకొనఁగా నే నియ్యకొన కుండీనా

(॥వప॥)
అప్పుడు నీవు చూచిన ఆసల చూపులే కా
దెప్పరమై నీమీఁదఁ దెగనీనివి
యిప్పుడె వేగిరమేల యింత నీవు బాఁతి పడి
చెప్పేటి నీప్రియములు చేకొనకుండేనా

(॥వప॥)
పెక్కురతులను నన్నుఁ బెనచే యీ కాఁగిలే కా
తక్కక నీపై వలపు తమి రేఁచేది
యిక్కువలంటి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
దక్కితి నిఁక నీమేలు తలఁచకుండేనా

(||pallavi||)
mābu dām̐kā nela nī manasu vachchidem̐ jālu
sebaṭṭina pani nī sittame yĕṟum̐gunu

(||vaba||)
maṁtanāna nī vāḍinamāḍalugā nāmadilo
yĕṁtainā nībaigobamu hĕchchanīnivi
paṁtamu nāgemi dappĕm̐ badavayya nīvu nannu
yiṁta veḍugŏnam̐gā ne niyyagŏna kuṁḍīnā

(||vaba||)
appuḍu nīvu sūsina āsala sūbule kā
dĕpparamai nīmīm̐dam̐ dĕganīnivi
yippuḍĕ vegiramela yiṁta nīvu bām̐ti paḍi
sĕppeḍi nīpriyamulu segŏnaguṁḍenā

(||vaba||)
pĕkkuradulanu nannum̐ bĕnase yī kām̐gile kā
takkaga nībai valabu tami rem̐sedi
yikkuvalaṁṭi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
dakkidi nim̐ka nīmelu talam̐saguṁḍenā