Maabu daamkaa maadodi(da?) maadalemtigi

మాపు దాఁకా మాతోడి(డ?) మాటలేఁటికి
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా మాతోడి(డ?) మాటలేఁటికి
తీపులఁ బెట్టి యాపె తెమలించీ నిన్నును

(॥మాపు॥)
మనసు వచ్చిన మాట మరి విన నింపౌను
చనవు గలుగు మాట చవివుట్టును
వినయము తోటి మాట వేడుకలు కడు రేఁచు
వినవయ్య నీకు నేఁడు విన్నవించీ నాకె

(॥మాపు॥)
వొడఁబాటైన మాట వుల్లము గరఁగఁజేయు
వుడివోనిమేలుమాట వొద్దికైవుండు
అడియాలమైనమాట ఆసలెల్లాఁ బొడమించు
విడువని తమకాన విన్నవించీనాకె

(॥మాపు॥)
తారుకాణలైనమాట తలఁపించు మర్మములు
నేరుపుతోడిమాట నించు వలపు
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్నునేఁడు
చేరి చేరి కాఁగిలించి చెప్పి చూపీ నాకె

(||pallavi||)
mābu dām̐kā mādoḍi(ḍa?) māḍalem̐ṭigi
tībulam̐ bĕṭṭi yābĕ tĕmaliṁchī ninnunu

(||mābu||)
manasu vachchina māḍa mari vina niṁpaunu
sanavu galugu māḍa savivuṭṭunu
vinayamu toḍi māḍa veḍugalu kaḍu rem̐su
vinavayya nīgu nem̐ḍu vinnaviṁchī nāgĕ

(||mābu||)
vŏḍam̐bāḍaina māḍa vullamu garam̐gam̐jeyu
vuḍivonimelumāḍa vŏddigaivuṁḍu
aḍiyālamainamāḍa āsalĕllām̐ bŏḍamiṁchu
viḍuvani tamagāna vinnaviṁchīnāgĕ

(||mābu||)
tārugāṇalainamāḍa talam̐piṁchu marmamulu
nerubudoḍimāḍa niṁchu valabu
yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nannunem̐ḍu
seri seri kām̐giliṁchi sĕppi sūbī nāgĕ