Maabu daamkaa maadalele marmamu seda numdamga

మాపు దాఁకా మాటలేలే మర్మము చేత నుండఁగ
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా మాటలేలే మర్మము చేత నుండఁగ
యేపున మీ నేరుపులు యిట్టే చూపరాదా

(॥॥)
పంతమాడ నేఁటికే పడఁతులాల మీతోను
కాంతుఁడే నన్నింతేసి గారవించఁగా
అంత గలితే మీరు ఆతనిఁ జొక్కించరాదా
యింతుల జాణతనాలు యేరువడీఁ గాని

(॥॥)
యేతులు చూప నేఁటికే యిందరి ముందర నేఁడు
ఆతఁడే నాపాలఁ జిక్కి అండ నుండఁగా
చేతనైతే మీరు పతిఁ జేకొని లోఁగొనరాదా
ఘాతల నందరి సొంపు గానవచ్చీఁ గాని

(॥॥)
మరిపెము లేటికే కిమ్ముల నిట్టే పచరించ
యిరవై శ్రీవేంకటేశుఁ డెనశుండఁగా
వరుసగా వలసితే వద్దనే మీరుండరాదా
గరిమ నందుల మేలు గానవచ్చీఁ గాని

(||pallavi||)
mābu dām̐kā māḍalele marmamu seda nuṁḍam̐ga
yebuna mī nerubulu yiṭṭe sūbarādā

(||||)
paṁtamāḍa nem̐ṭige paḍam̐tulāla mīdonu
kāṁtum̐ḍe nanniṁtesi gāraviṁcham̐gā
aṁta galide mīru ādanim̐ jŏkkiṁcharādā
yiṁtula jāṇadanālu yeruvaḍīm̐ gāni

(||||)
yedulu sūba nem̐ṭige yiṁdari muṁdara nem̐ḍu
ādam̐ḍe nābālam̐ jikki aṁḍa nuṁḍam̐gā
sedanaide mīru padim̐ jegŏni lom̐gŏnarādā
ghādala naṁdari sŏṁpu gānavachchīm̐ gāni

(||||)
maribĕmu leḍige kimmula niṭṭe pasariṁcha
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍĕnaśhuṁḍam̐gā
varusagā valaside vaddane mīruṁḍarādā
garima naṁdula melu gānavachchīm̐ gāni