Maabu daamkaa maadalela maadom jaala

మాపు దాఁకా మాటలేల మాతోఁ జాల
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా మాటలేల మాతోఁ జాల
పైపై నున్నది నీపై నిదెవోలా

(॥మాపు॥)
చెలిఁ గొంగువట్టి తీసి చేయిమీదఁ జేయివేసి
యెలమి వలపురేఁచే వెగపోసి
మెలుపునఁ జందురుఁడు మీమీఁద వెన్నెల గానీ
కలయరాదావిభుఁడ కలికిని డాసి

(॥మాపు॥)
మగువయిల్లు చొచ్చి మచ్చికలఁ జనవచ్చి
నగవులునవ్వేవు నడుమఁ గొచ్చి
పగటున వలరాచలబలము పౌఁజులై వచ్చీ
జగడము మానరాదా జవరాలిమెచ్చి

(॥మాపు॥)
రమణిఁగాగిఁ గూడిరతులనే వసివాడి
తమితోమన్నించితివి తగు నీవాడి
నమమై శ్రీవేంకటేశ చల్లగాలి విసరాడీ
చెమట లార్చుకోరాదా సిగ్గులువీడి

(||pallavi||)
mābu dām̐kā māḍalela mādom̐ jāla
paibai nunnadi nībai nidĕvolā

(||mābu||)
sĕlim̐ gŏṁguvaṭṭi tīsi seyimīdam̐ jeyivesi
yĕlami valaburem̐se vĕgabosi
mĕlubunam̐ jaṁdurum̐ḍu mīmīm̐da vĕnnĕla gānī
kalayarādāvibhum̐ḍa kaligini ḍāsi

(||mābu||)
maguvayillu sŏchchi machchigalam̐ janavachchi
nagavulunavvevu naḍumam̐ gŏchchi
pagaḍuna valarāsalabalamu paum̐julai vachchī
jagaḍamu mānarādā javarālimĕchchi

(||mābu||)
ramaṇim̐gāgim̐ gūḍiradulane vasivāḍi
tamidomanniṁchidivi tagu nīvāḍi
namamai śhrīveṁkaḍeśha sallagāli visarāḍī
sĕmaḍa lārsugorādā sigguluvīḍi