మాపు దాఁకా జోలి యేల మనసొక్కటాయ నేఁడు
(॥పల్లవి॥)
మాపు దాఁకా జోలి యేల మనసొక్కటాయ నేఁడు
యే పొద్దుదాఁకాఁ జెప్పే వియ్యకొంటి రావయ్యా
(॥వప॥)
చెలరేఁగి రమణుఁడు చెక్కు నొక్కి వేఁడుకోఁగా
చలపాదితన మేల, సకియకును
అలుకలెల్లాఁ దీరి ఆసతోడఁ బెనఁగఁగ
కలిగినపాటే మేలు కైకొంటి రావయ్యా
(॥వప॥)
సేనలు వెట్టినవాఁడు చేరి వొడఁబరచఁగ
వాసితోఁ గొసరనేల వనితకును
వేసరక వూడిగాలు వెస నేపొద్దుఁ జేయఁగా
యేసేఁతలై నా మేలు యెదురాడవయ్యా
(॥వప॥)
శ్రీవెంటేశ్వర చిత్తగించి నీవేలఁగా
వావు లడుగనేల నావంటిదానికి
భావములోపల నమ్మి పైకొని భోగించఁగాను
దేవులనౌటే మేలు తెలిసితి రావయ్యా
(||pallavi||)
mābu dām̐kā joli yela manasŏkkaḍāya nem̐ḍu
ye pŏddudām̐kām̐ jĕppe viyyagŏṁṭi rāvayyā
(||vaba||)
sĕlarem̐gi ramaṇum̐ḍu sĕkku nŏkki vem̐ḍugom̐gā
salabādidana mela, sagiyagunu
alugalĕllām̐ dīri āsadoḍam̐ bĕnam̐gam̐ga
kaliginabāḍe melu kaigŏṁṭi rāvayyā
(||vaba||)
senalu vĕṭṭinavām̐ḍu seri vŏḍam̐barasam̐ga
vāsidom̐ gŏsaranela vanidagunu
vesaraga vūḍigālu vĕsa nebŏddum̐ jeyam̐gā
yesem̐talai nā melu yĕdurāḍavayyā
(||vaba||)
śhrīvĕṁṭeśhvara sittagiṁchi nīvelam̐gā
vāvu laḍuganela nāvaṁṭidānigi
bhāvamulobala nammi paigŏni bhogiṁcham̐gānu
devulanauḍe melu tĕlisidi rāvayyā