Maabu daamkaa joli mari yemtigi

మాపు దాఁకా జోలి మరి యేఁటికి
Language

(॥పల్లవి॥)
మాపు దాఁకా జోలి మరి యేఁటికి
కోపుల మీరెను కొసరులు

(॥మాపు॥)
సరివచ్చె నేఁడు సతికి నీకును
సిరుల నవ్వుల సెలవులు
పొరుగుకు వచ్చె పొద్దున మీకిదె
గరగరికెల కరఁగులు

(॥మాపు॥)
చొప్పణఁగె నేఁడు సుదతికి నీకు
తప్పక చూచేవి తడవులు
ముప్పిరి గొనెను మోహము లోననే
కొప్పులు జారి గురుతులు

(॥మాపు॥)
తగవులఁ బెట్టీ తరుణికి నీకు
బిగువు కాఁగిటి పెనఁగులు
జిగిఁ గూడితిరి శ్రీ వెంకటేశుఁడ
తగులాయ మీతలఁపులు

(||pallavi||)
mābu dām̐kā joli mari yem̐ṭigi
kobula mīrĕnu kŏsarulu

(||mābu||)
sarivachchĕ nem̐ḍu sadigi nīgunu
sirula navvula sĕlavulu
pŏrugugu vachchĕ pŏdduna mīgidĕ
garagarigĕla karam̐gulu

(||mābu||)
sŏppaṇam̐gĕ nem̐ḍu sudadigi nīgu
tappaga sūsevi taḍavulu
muppiri gŏnĕnu mohamu lonane
kŏppulu jāri gurudulu

(||mābu||)
tagavulam̐ bĕṭṭī taruṇigi nīgu
biguvu kām̐giḍi pĕnam̐gulu
jigim̐ gūḍidiri śhrī vĕṁkaḍeśhum̐ḍa
tagulāya mīdalam̐pulu