మాపై నింత కరుణైతే మంచిదాయను
(॥పల్లవి॥)
మాపై నింత కరుణైతే మంచిదాయను
చూపుల నీ పాటి నన్నుఁ జూచితివిగా
(॥మాపై॥)
నీవు గలిగియుండఁగా నివ్వెఱఁగేల
చేవ దేరి యుండఁగాను చిన్నఁబో నేల
కావరాన న న్నేల గరిసించేవు
యీ విధి బుజ్జగించ నీ కేమౌదు నేను
(॥మాపై॥)
చేరి నీవుఁవే డుకోఁగా చెక్కు చే యాల
గారవించఁగా నాకు కన్నీ రేల
వూరకే న న్నేల యింక వొడి వట్టేవు
నారుకొన్నసతులు శానలు గారా నీకు
(॥మాపై॥)
కౌఁగిట నీవు గూడ గా కాంతాళ మేల
మాఁగినమో వియ్యఁగా మారాడ నేల
దాఁగినఁ బోనీక నన్ను దక్కఁ గొంటివి
పాఁగిన శ్రీవేంకటేశ పంతమింత వలెనా
(||pallavi||)
mābai niṁta karuṇaide maṁchidāyanu
sūbula nī pāḍi nannum̐ jūsidivigā
(||mābai||)
nīvu galigiyuṁḍam̐gā nivvĕṟam̐gela
seva deri yuṁḍam̐gānu sinnam̐bo nela
kāvarāna na nnela garisiṁchevu
yī vidhi bujjagiṁcha nī kemaudu nenu
(||mābai||)
seri nīvum̐ve ḍugom̐gā sĕkku se yāla
gāraviṁcham̐gā nāgu kannī rela
vūrage na nnela yiṁka vŏḍi vaṭṭevu
nārugŏnnasadulu śhānalu gārā nīgu
(||mābai||)
kaum̐giḍa nīvu gūḍa gā kāṁtāḽa mela
mām̐ginamo viyyam̐gā mārāḍa nela
dām̐ginam̐ bonīga nannu dakkam̐ gŏṁṭivi
pām̐gina śhrīveṁkaḍeśha paṁtamiṁta valĕnā