Maabai nimta karunaide mamchidaayanu

మాపై నింత కరుణైతే మంచిదాయను
Language

(॥పల్లవి॥)
మాపై నింత కరుణైతే మంచిదాయను
చూపుల నీపాటి నన్నుఁ జూచితివి గా

(॥మాపై॥)
నీవు గలిగి వుండఁగా నివ్వెర గేల
చేవదేరి వుండఁగాను చిన్నఁబో నేల
కావిరి న న్నేల యింత గరిసించేవు
యీవిధి బుజ్జగించ నీకే మౌదు నేను

(॥మాపై॥)
చేరి నీవు వేఁడుకోఁగా చెక్కుచే యేల
గారవించఁగాను నాకుఁ గన్నీ రేల
వూరకే న న్నేల యింకా నొడి వట్టేవు
నారుకొన్నసతులు శేనలు గారా

(॥మాపై॥)
కాఁగిట నీవు గూడఁగా కాఁతళ మేల
మాఁగినమో వియ్యంగాను మారాడ నేల
దాఁగినాఁ బోనిక నన్ను దక్కఁ గొంటివి
పొఁగినశ్రీ వేంకటేశ పంత మింత వలెనా

(||pallavi||)
mābai niṁta karuṇaide maṁchidāyanu
sūbula nībāḍi nannum̐ jūsidivi gā

(||mābai||)
nīvu galigi vuṁḍam̐gā nivvĕra gela
sevaderi vuṁḍam̐gānu sinnam̐bo nela
kāviri na nnela yiṁta garisiṁchevu
yīvidhi bujjagiṁcha nīge maudu nenu

(||mābai||)
seri nīvu vem̐ḍugom̐gā sĕkkuse yela
gāraviṁcham̐gānu nāgum̐ gannī rela
vūrage na nnela yiṁkā nŏḍi vaṭṭevu
nārugŏnnasadulu śhenalu gārā

(||mābai||)
kām̐giḍa nīvu gūḍam̐gā kām̐taḽa mela
mām̐ginamo viyyaṁgānu mārāḍa nela
dām̐ginām̐ boniga nannu dakkam̐ gŏṁṭivi
pŏm̐ginaśhrī veṁkaḍeśha paṁta miṁta valĕnā