మాపై బారాలు వేయకు మతకానను
(॥పల్లవి॥)
మాపై బారాలు వేయకు మతకానను
చేపట్టినవాఁడవు నీచేతివే మహిమలు
(॥మాపై॥)
రాసికెక్క నీవు మమ్ము రాఁపుసేసిన సుద్దులు
వాసికెక్కె మాగుణము వలపుతోను
ఆస యేమిటాఁ దీరదు అండకు నీవు రాఁగాను
సేసేటి పనులు నీచేతనున్న విఁకను
(॥మాపై॥)
దొంతులు నిండెను నీవు తొల్లిచ్చిన చనవులు
వంతుల గాచుకుండె నావన్నెలమోవి
పంతము దీరదు నీవు పలుమారు వేఁడుకొన్నా
చెంతల మన్నించేది నీచేతిదే ఇపుడు
(॥మాపై॥)
వేడుకాయ నీవాడించే వేమారు యెడమాటలు
వాడికాయ నవి నాకు వడదేరెను
వీడదు కాఁగి నిదె శ్రీ వేంకటేశ కూడితిమి
చేడె లేమి చెప్పేరు నీచేతివే భోగములు
(||pallavi||)
mābai bārālu veyagu madagānanu
sebaṭṭinavām̐ḍavu nīsedive mahimalu
(||mābai||)
rāsigĕkka nīvu mammu rām̐pusesina suddulu
vāsigĕkkĕ māguṇamu valabudonu
āsa yemiḍām̐ dīradu aṁḍagu nīvu rām̐gānu
seseḍi panulu nīsedanunna vim̐kanu
(||mābai||)
dŏṁtulu niṁḍĕnu nīvu tŏllichchina sanavulu
vaṁtula gāsuguṁḍĕ nāvannĕlamovi
paṁtamu dīradu nīvu palumāru vem̐ḍugŏnnā
sĕṁtala manniṁchedi nīsedide ibuḍu
(||mābai||)
veḍugāya nīvāḍiṁche vemāru yĕḍamāḍalu
vāḍigāya navi nāgu vaḍaderĕnu
vīḍadu kām̐gi nidĕ śhrī veṁkaḍeśha kūḍidimi
seḍĕ lemi sĕpperu nīsedive bhogamulu