మా యింటికి రావయ్యా మాటలేఁటికి
(॥పల్లవి॥)
మా యింటికి రావయ్యా మాటలేఁటికి
చాయలా సన్నలా నీపై సంతోసమే నాకును
(॥మాయిం॥)
మోమునఁ గళలు దేరీ ముక్కున నిట్టూర్పు లూరీ
నీ మతకపు చేఁతకు నే నేమనేను
గామిడి వనఁగరాదు కల్ల మోపఁబనిలేదు
యేమైనా నీ పనులు ఇయ్యకోలే నాకును
(॥మాయిం॥)
చెక్కులఁ జెమట మించీ సెలవి నవ్వులు ముంచీ
నెకొన్ననీ యెమ్మెలకు నే నేమనేను
కక్కసించి నిఁక వద్దు కడువేగె నిదె పొద్దు
యెక్కడనుండి వచ్చినా ఇయ్యకోలే నాకును
(॥మాయిం॥)
మోవిపైఁ గెంపులు రాఁగీ భావమెల్లాఁ జిమ్మిరేఁగీ
నీవెంత కాకు సేసినా నేనేమనేను
శ్రీ వేంకటేశ ముందు చేకొను రతులవిందు
యీవేళ నన్నేలితివి ఇయ్యకోలే నాకును
(||pallavi||)
mā yiṁṭigi rāvayyā māḍalem̐ṭigi
sāyalā sannalā nībai saṁtosame nāgunu
(||māyiṁ||)
momunam̐ gaḽalu derī mukkuna niṭṭūrbu lūrī
nī madagabu sem̐tagu ne nemanenu
gāmiḍi vanam̐garādu kalla mobam̐baniledu
yemainā nī panulu iyyagole nāgunu
(||māyiṁ||)
sĕkkulam̐ jĕmaḍa miṁchī sĕlavi navvulu muṁchī
nĕgŏnnanī yĕmmĕlagu ne nemanenu
kakkasiṁchi nim̐ka vaddu kaḍuvegĕ nidĕ pŏddu
yĕkkaḍanuṁḍi vachchinā iyyagole nāgunu
(||māyiṁ||)
movibaim̐ gĕṁpulu rām̐gī bhāvamĕllām̐ jimmirem̐gī
nīvĕṁta kāgu sesinā nenemanenu
śhrī veṁkaḍeśha muṁdu segŏnu radulaviṁdu
yīveḽa nannelidivi iyyagole nāgunu