Maa vasamaa buddiseppa mari neeyem(yam?)tavaanigi

మా వసమా బుద్దిచెప్ప మరి నీయెం(యం?)తవానికి
Language

(॥పల్లవి॥)
మా వసమా బుద్దిచెప్ప మరి నీయెం(యం?)తవానికి
నీవే యెఱింగి పతికి నెయ్యములు చూపవే

(॥మావ॥)
మల్లాడేకోపకత్తెను మట్టుకుఁ దేవచ్చుఁగాని
చల్లజంపులాఁడినైతే సాదించరాదు
తెల్లమిగా గోలదానిఁ దీరుకుఁ దేవచ్చుఁగాని
వొల్లనే జూటుదాని నొడఁబరచరాదు

(॥మావ॥)
చలమరిదానినైనా చాయకుఁ దేవచ్చుఁగాని
పలువినయపుదాని గెలువరాదు
సొలసి పంతపుదాని సూటికిఁ దేవచ్చు గాని
లలి నాలిదానిగుట్టు దెలియఁగరాదు

(॥మావ॥)
వెట్టచేఁతలాఁడినైనా వీఁకకుఁ దేవచ్చుఁగాని
చుట్టపుసూడుదానిఁ జొక్కించరాదు
పట్టి యలమేలునుంగపతి శ్రీవేంకటేశ్వరు
నిట్టె కూడితివి నిన్ను నిఁక దూరరాదు

(||pallavi||)
mā vasamā buddisĕppa mari nīyĕṁ(yaṁ?)tavānigi
nīve yĕṟiṁgi padigi nĕyyamulu sūbave

(||māva||)
mallāḍegobagattĕnu maṭṭugum̐ devachchum̐gāni
sallajaṁpulām̐ḍinaide sādiṁcharādu
tĕllamigā goladānim̐ dīrugum̐ devachchum̐gāni
vŏllane jūḍudāni nŏḍam̐barasarādu

(||māva||)
salamaridāninainā sāyagum̐ devachchum̐gāni
paluvinayabudāni gĕluvarādu
sŏlasi paṁtabudāni sūḍigim̐ devachchu gāni
lali nālidāniguṭṭu dĕliyam̐garādu

(||māva||)
vĕṭṭasem̐talām̐ḍinainā vīm̐kagum̐ devachchum̐gāni
suṭṭabusūḍudānim̐ jŏkkiṁcharādu
paṭṭi yalamelunuṁgabadi śhrīveṁkaḍeśhvaru
niṭṭĕ kūḍidivi ninnu nim̐ka dūrarādu