మా పొందు సేయుమా మచ్చికలతోడ
(॥పల్లవి॥)
మా పొందు సేయుమా మచ్చికలతోడ
ఆ పనిఁ దిరుగఁగా నదవదలాయ
(॥॥)
మందమగువలు మాటలాడుకోఁగా
కందువల నీకుఁ గతలాయ
సందడించి పైఁ పైఁ జల్ల లమ్మఁగా
చిందుచు నీమేన జిరుకులాయ
(॥॥)
నటన నందరును నవ్వులు నవ్వఁగా
గుటుక నీమోవి గురులాయ
తటకున లోలోఁ దనువు లంటఁ గా
జొటజొటఁ జెమటలు చొతుకులాయ
(॥॥)
చెలరేఁగి యందరు సేవలు సేయఁగ
కలిమాయ శ్రీ వేంకటవిభుఁడా
అలమేలుమంగనై ఆయము లంటఁగా
బలిమి వేడుకల గొబ్బనఁ బదనాయ
(||pallavi||)
mā pŏṁdu seyumā machchigaladoḍa
ā panim̐ dirugam̐gā nadavadalāya
(||||)
maṁdamaguvalu māḍalāḍugom̐gā
kaṁduvala nīgum̐ gadalāya
saṁdaḍiṁchi paim̐ paim̐ jalla lammam̐gā
siṁdusu nīmena jirugulāya
(||||)
naḍana naṁdarunu navvulu navvam̐gā
guḍuga nīmovi gurulāya
taḍaguna lolom̐ danuvu laṁṭam̐ gā
jŏḍajŏḍam̐ jĕmaḍalu sŏdugulāya
(||||)
sĕlarem̐gi yaṁdaru sevalu seyam̐ga
kalimāya śhrī veṁkaḍavibhum̐ḍā
alamelumaṁganai āyamu laṁṭam̐gā
balimi veḍugala gŏbbanam̐ badanāya