Maa mumdaram dechchi yemta mattumeera navvevu

మా ముందరఁ దెచ్చి యెంత మట్టుమీర నవ్వేవు
Language

(॥పల్లవి॥)
మా ముందరఁ దెచ్చి యెంత మట్టుమీర నవ్వేవు
ప్రేమగలితే లోనికిఁ బిలుచుకోరాదా

(॥మాముం॥)
నీకు నాకెకును నేఁడు నేస్తమంత గలితేను
కైకొని నీమెడఁగుచ్చి కట్టుకోరాదా
వాకముగ దొరఁజేయవలసితే నీముందర
కోక వరచి యందుపైఁ గూచుండఁబెట్టరాదా

(॥మాముం॥)
నెలఁతపై మోహము నిలుపరాకుంటేను
సొలసి పయ్యదలోను చొచ్చుకోరాదా
తలకొన్నయాకెచక్కఁదనము నీకుఁ బాఁతైతే
పొలుపుమీర వర్ణించి పొగడరాదా

(॥మాముం॥)
సుదతికి నీకు నిట్టె చుట్టరికమై తేను
కదిసి యెంగిలిపొత్తు గలయరాదా
యెదుట శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
పొదిగే వాపెను నీవీఁపున నిలుపరాదా

(||pallavi||)
mā muṁdaram̐ dĕchchi yĕṁta maṭṭumīra navvevu
premagalide lonigim̐ bilusugorādā

(||māmuṁ||)
nīgu nāgĕgunu nem̐ḍu nestamaṁta galidenu
kaigŏni nīmĕḍam̐guchchi kaṭṭugorādā
vāgamuga dŏram̐jeyavalaside nīmuṁdara
koga varasi yaṁdubaim̐ gūsuṁḍam̐bĕṭṭarādā

(||māmuṁ||)
nĕlam̐tabai mohamu nilubarāguṁṭenu
sŏlasi payyadalonu sŏchchugorādā
talagŏnnayāgĕsakkam̐danamu nīgum̐ bām̐taide
pŏlubumīra varṇiṁchi pŏgaḍarādā

(||māmuṁ||)
sudadigi nīgu niṭṭĕ suṭṭarigamai tenu
kadisi yĕṁgilibŏttu galayarādā
yĕduḍa śhrī veṁkaḍeśha yiṭṭe nannu nelidivi
pŏdige vābĕnu nīvīm̐puna nilubarādā