Maa mumdara nimtesi madagamu lemidigi

మా ముందర నింతేసి మతకము లేమిటికి
Language

(॥పల్లవి॥)
మా ముందర నింతేసి మతకము లేమిటికి
నీమాఁటలోనిదాన నే నౌత యెఱఁగవా

(॥మాముం॥)
చుట్టము గాఁబోలు నీకు చూచీ నల్లాడమండి
పట్టెఁడేసి చన్నుల పడఁతి
వట్టి సిగ్గులేమిటికి వలపే కలిగితేను
గట్టగాఁ జేయరాదా కాఁపుర మాపెతోను

(॥మాముం॥)
తారుకాణలు గాఁబోలు తగిలి సన్నలు సేసీ
చేరఁడేసి కన్నుల చెలియ
పూరకుండనేల నీకు వొన గూడ వేడుకైతే
చేరి కాఁగిలించరాదా చేయిముందుగాను

(॥మాముం॥)
సాఁగిన పొందు గాఁబొలు పాటవాడి నీమిఁద
కాఁగెఁడేసి పిఱుఁదుల కలికి
చేఁగెదేరఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను
మాఁగిన మోవియ్యరాదా మన్నించి యాకెకును

(||pallavi||)
mā muṁdara niṁtesi madagamu lemiḍigi
nīmām̐ṭalonidāna ne nauda yĕṟam̐gavā

(||māmuṁ||)
suṭṭamu gām̐bolu nīgu sūsī nallāḍamaṁḍi
paṭṭĕm̐ḍesi sannula paḍam̐ti
vaṭṭi siggulemiḍigi valabe kaligidenu
gaṭṭagām̐ jeyarādā kām̐pura mābĕdonu

(||māmuṁ||)
tārugāṇalu gām̐bolu tagili sannalu sesī
seram̐ḍesi kannula sĕliya
pūraguṁḍanela nīgu vŏna gūḍa veḍugaide
seri kām̐giliṁcharādā seyimuṁdugānu

(||māmuṁ||)
sām̐gina pŏṁdu gām̐bŏlu pāḍavāḍi nīmim̐da
kām̐gĕm̐ḍesi piṟum̐dula kaligi
sem̐gĕderam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannu
mām̐gina moviyyarādā manniṁchi yāgĕgunu