Maa mumdara nela sesee madagamulu

మా ముందర నేల సేసీ మతకములు
Language

(॥పల్లవి॥)
మా ముందర నేల సేసీ మతకములు
మోముచూచి యాపెతోడ ముచ్చటాడుఁ గాక

(॥॥)
చెలిఁ బెండ్లాడిన వాఁడు సిగ్గులు వడఁగనేల
నలువంక నాపెతోనే నవ్వుఁ గాక
వలచినవాఁడు తాను వాసులెంచుకొన నేల
కెలఁకులఁ గమ్మటిని కిందుపడుఁ గాక

(॥॥)
బువ్వానఁ గూచున్న వాఁడు పొంచి యెంగిలననేల
చివ్వన నారగించి చెలఁగుఁ గాక
రవ్వై వీడె మిచ్చేవాండు రాజసము లెంచనేల
మవ్వఁపు దెల్లనాకులు మడిచి యిచ్చుఁ గాక

(॥॥)
పానుపుపై నున్నవాఁడు పరాకు సేయఁగ నేల
కానిమ్మని యాపె దానుఁ గలయుఁ గాక
వేనలెంట నేల శ్రీవేంకటేశుఁడై నవాఁడు
మోనానఁ గూడినట్లానె మొక్కుచుండుఁ గాక

(||pallavi||)
mā muṁdara nela sesī madagamulu
momusūsi yābĕdoḍa muchchaḍāḍum̐ gāga

(||||)
sĕlim̐ bĕṁḍlāḍina vām̐ḍu siggulu vaḍam̐ganela
naluvaṁka nābĕdone navvum̐ gāga
valasinavām̐ḍu tānu vāsulĕṁchugŏna nela
kĕlam̐kulam̐ gammaḍini kiṁdubaḍum̐ gāga

(||||)
buvvānam̐ gūsunna vām̐ḍu pŏṁchi yĕṁgilananela
sivvana nāragiṁchi sĕlam̐gum̐ gāga
ravvai vīḍĕ michchevāṁḍu rājasamu lĕṁchanela
mavvam̐pu dĕllanāgulu maḍisi yichchum̐ gāga

(||||)
pānububai nunnavām̐ḍu parāgu seyam̐ga nela
kānimmani yābĕ dānum̐ galayum̐ gāga
venalĕṁṭa nela śhrīveṁkaḍeśhum̐ḍai navām̐ḍu
monānam̐ gūḍinaṭlānĕ mŏkkusuṁḍum̐ gāga