మా ముందర నీవేల మఱఁగులు వెట్టేవు
(॥పల్లవి॥)
మా ముందర నీవేల మఱఁగులు వెట్టేవు
యీ మతకములెల్లా మీ యిక్కువలు గావా
(॥వముం॥)
వీడెము చేతికియ్యవే విభుఁడు నీమోము చూచి
యీడుజోడై కూడె యందు కెఱుకగాదా
వేడుకఁ బాదాలోత్తవే వెసఁ బవ్వళించినాఁడు
జాడతోడ నీకదే సన్నగాదా
(॥వముం॥)
యేకతాన మాటాడవే యేమిటికొ పిలిచీని
లాకల నీరతులకు లాచుటగాదా
పైకొని తెరవేయవే పచ్చడము గప్పుమనీ
నీకు నాతనికి నీవే నెపములు గావా
(॥వముం॥)
చెలఁగి కాంగిలించవే చేయి నీమీఁద వేసీని
కలయికలకు నదే కందువగాదా
అలమేలుమంగవు నీవతఁడు శ్రీవేంకటేశుఁ-
డలమె నిన్నుఁ జెల్లెల నందుకు నేలోఁగాదా
(||pallavi||)
mā muṁdara nīvela maṟam̐gulu vĕṭṭevu
yī madagamulĕllā mī yikkuvalu gāvā
(||vamuṁ||)
vīḍĕmu sedigiyyave vibhum̐ḍu nīmomu sūsi
yīḍujoḍai kūḍĕ yaṁdu kĕṟugagādā
veḍugam̐ bādālottave vĕsam̐ bavvaḽiṁchinām̐ḍu
jāḍadoḍa nīgade sannagādā
(||vamuṁ||)
yegadāna māḍāḍave yemiḍigŏ pilisīni
lāgala nīradulagu lāsuḍagādā
paigŏni tĕraveyave pachchaḍamu gappumanī
nīgu nādanigi nīve nĕbamulu gāvā
(||vamuṁ||)
sĕlam̐gi kāṁgiliṁchave seyi nīmīm̐da vesīni
kalayigalagu nade kaṁduvagādā
alamelumaṁgavu nīvadam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍalamĕ ninnum̐ jĕllĕla naṁdugu nelom̐gādā