Maa manasela sodimchi maadalaadimchevu neevu

మా మనసేల సోదించి మాటలాడించేవు నీవు
Language

(॥పల్లవి॥)
మా మనసేల సోదించి మాటలాడించేవు నీవు
నీ మన సెఱఁగనిది నేము చెప్పేమా

(॥వమ॥)
వాడికైనయాపె నిన్ను వలపించుకుండఁగాను
వేడుకకత్తెలకేల వెంగెమాడను
జాడతోడ నేమూ నిట్టె సంతోసించవలెఁగాక
పాడిఁబంతా లెంచి తేను పచ్చిదేరదా

(॥వమ॥)
మచ్చికైనయాపె నీతో మంతనములాడఁగాను
యిచ్చకురాండ్లకేల యీసురేఁగను
మెచ్చిమెచ్చి యాపొందే నీమెడఁ గట్టుదుముగాక
విచ్చి చెప్పఁ బోతేను వేసటగాదా

(॥వమ॥)
రతివేళ నాపె నిన్ను రాఁపు లింత సేయఁగాను
సతమైనవారికేల జంకిచను
తతి నలమేలుమంగపతివి శ్రీవేంకటేశ
యితవై నన్నేలితివి యిది గొత్తగాదా

(||pallavi||)
mā manasela sodiṁchi māḍalāḍiṁchevu nīvu
nī mana sĕṟam̐ganidi nemu sĕppemā

(||vama||)
vāḍigainayābĕ ninnu valabiṁchuguṁḍam̐gānu
veḍugagattĕlagela vĕṁgĕmāḍanu
jāḍadoḍa nemū niṭṭĕ saṁtosiṁchavalĕm̐gāga
pāḍim̐baṁtā lĕṁchi tenu pachchideradā

(||vama||)
machchigainayābĕ nīdo maṁtanamulāḍam̐gānu
yichchagurāṁḍlagela yīsurem̐ganu
mĕchchimĕchchi yābŏṁde nīmĕḍam̐ gaṭṭudumugāga
vichchi sĕppam̐ bodenu vesaḍagādā

(||vama||)
radiveḽa nābĕ ninnu rām̐pu liṁta seyam̐gānu
sadamainavārigela jaṁkisanu
tadi nalamelumaṁgabadivi śhrīveṁkaḍeśha
yidavai nannelidivi yidi gŏttagādā