(॥పల్లవి॥)
మా మాట వినవే మగువా
చే ముంచి చెనకితేను చిగిరించుఁ గోరికె
(॥॥)
మొక్కలపు మాట లేలే మోహించిన పతితోడ
చిక్కని ప్రియములే చెప్పరాదా
లక్కవంటిది మనసు లావుల కొలఁది రాదు
యెక్కుడు చెలము లైతే యెంతైనాఁ గరఁగదు
(॥॥)
బొమ్మల జంకించ సేలే పొందైన వాని తోడ
నమ్మిక చేసన్న చూపి నవ్వరాదా
సొమ్మువంటిది వలపు చూచితే విడువరాదు
యెమ్మెలకుఁ బెట్టు కొంటి నెంతైనాఁ దనియదు
(॥॥)
సిగ్గులు వడఁగ నేలే శ్రీ వేంకటేశ్వరుతో
వెగ్గలించి కూడితివి వీడె మీరాదా
ముగ్గువంటిది వయసు మొఱఁగి దాఁచరాదు
యెగ్గు లేక వెదకితే నెంతైనాఁ గలదు
(||pallavi||)
mā māḍa vinave maguvā
se muṁchi sĕnagidenu sigiriṁchum̐ gorigĕ
(||||)
mŏkkalabu māḍa lele mohiṁchina padidoḍa
sikkani priyamule sĕpparādā
lakkavaṁṭidi manasu lāvula kŏlam̐di rādu
yĕkkuḍu sĕlamu laide yĕṁtainām̐ garam̐gadu
(||||)
bŏmmala jaṁkiṁcha sele pŏṁdaina vāni toḍa
nammiga sesanna sūbi navvarādā
sŏmmuvaṁṭidi valabu sūside viḍuvarādu
yĕmmĕlagum̐ bĕṭṭu kŏṁṭi nĕṁtainām̐ daniyadu
(||||)
siggulu vaḍam̐ga nele śhrī veṁkaḍeśhvarudo
vĕggaliṁchi kūḍidivi vīḍĕ mīrādā
mugguvaṁṭidi vayasu mŏṟam̐gi dām̐sarādu
yĕggu lega vĕdagide nĕṁtainām̐ galadu