Maa maada vinamgadave mamku lemtige

మా మాట వినఁగదవే మంకు లేఁటికే
Language

(॥పల్లవి॥)
మా మాట వినఁగదవే మంకు లేఁటికే
కామునమ్ములకు గుఱిగా నిలువ వసమా

(॥॥)
చెక్కు నొక్కి వేఁడుకొని చేయి చేతఁబట్టు కొని
మక్కువ చల్లిఁ బతితో మాటలాడవే
లక్కవంటిది మనసు లాలించీ నాతఁడు నిన్ను
గక్కన నింతట నైనా గరఁగఁగ వలదా

(॥॥)
వొడి వట్టి పెనఁగుతా నొడఁ బరచుకొంటాను
తొడరేటి నీ మగని తోడ నగవే
విడువ రాదు వలపు వీడె మిచ్చీ నాతఁడు
అడియాలమై చేవట్టి ఆదరించవలదా

(॥॥)
వావులు నీకుఁ జెప్పీ వడి సరసము లాడీ
శ్రీ వేంకటేశుని రతిఁ జెందఁ గదవే
దేవి నలమేల్మంగవు తేరి కూడె ని న్నితఁడు
తావుకొనఁ జేరె నిట్టే తగ మెచ్చవలదా

(||pallavi||)
mā māḍa vinam̐gadave maṁku lem̐ṭige
kāmunammulagu guṟigā niluva vasamā

(||||)
sĕkku nŏkki vem̐ḍugŏni seyi sedam̐baṭṭu kŏni
makkuva sallim̐ badido māḍalāḍave
lakkavaṁṭidi manasu lāliṁchī nādam̐ḍu ninnu
gakkana niṁtaḍa nainā garam̐gam̐ga valadā

(||||)
vŏḍi vaṭṭi pĕnam̐gudā nŏḍam̐ barasugŏṁṭānu
tŏḍareḍi nī magani toḍa nagave
viḍuva rādu valabu vīḍĕ michchī nādam̐ḍu
aḍiyālamai sevaṭṭi ādariṁchavaladā

(||||)
vāvulu nīgum̐ jĕppī vaḍi sarasamu lāḍī
śhrī veṁkaḍeśhuni radim̐ jĕṁdam̐ gadave
devi nalamelmaṁgavu teri kūḍĕ ni nnidam̐ḍu
tāvugŏnam̐ jerĕ niṭṭe taga mĕchchavaladā