మా మాట నమ్మదు నీ మతకానకు లోనంటా
(॥పల్లవి॥)
మా మాట నమ్మదు నీ మతకానకు లోనంటా
చే ముట్టి బుజ్జగించి చెక్కు నొక్కవయ్యా
(॥॥)
మంతనాన నీ వాపెతో మాటలాడిన మాటా
యింతలో నెవ్వరు చెప్పి రీకెకు నేఁడు
చింతించి యందుకుఁ గాను చెక్కు చేతితో నున్నది
సంతోసపడ నాన లిచ్చటఁ బెట్టు కోవయ్యా
(॥॥)
కుప్పళించి నీ వాకెఁ గూడిన దంతపుటిల్లు
యిప్పుడే యెవ్వరు చెప్పి రీపెకు నేఁడు
చెప్పరాని కాంత తోడ సిబ్బితి పడినందుకు
తప్పు దీర ముందరికేఁ దడవ ననవయ్యా
(॥॥)
ఆపె చేతి వుంగరము అట్టే నీ వేల నుండఁ గా
యేపున నెవ్వ రిచ్చిరి యీపెకు నేఁ డు
యీ పొద్దు నీవు గూడఁగ నిచ్చకముతో నున్నది
చేపట్టి శ్రీ వేంకటేశ సేదలు దీర్చవయ్యా
(||pallavi||)
mā māḍa nammadu nī madagānagu lonaṁṭā
se muṭṭi bujjagiṁchi sĕkku nŏkkavayyā
(||||)
maṁtanāna nī vābĕdo māḍalāḍina māḍā
yiṁtalo nĕvvaru sĕppi rīgĕgu nem̐ḍu
siṁtiṁchi yaṁdugum̐ gānu sĕkku sedido nunnadi
saṁtosabaḍa nāna lichchaḍam̐ bĕṭṭu kovayyā
(||||)
kuppaḽiṁchi nī vāgĕm̐ gūḍina daṁtabuḍillu
yippuḍe yĕvvaru sĕppi rībĕgu nem̐ḍu
sĕpparāni kāṁta toḍa sibbidi paḍinaṁdugu
tappu dīra muṁdarigem̐ daḍava nanavayyā
(||||)
ābĕ sedi vuṁgaramu aṭṭe nī vela nuṁḍam̐ gā
yebuna nĕvva richchiri yībĕgu nem̐ ḍu
yī pŏddu nīvu gūḍam̐ga nichchagamudo nunnadi
sebaṭṭi śhrī veṁkaḍeśha sedalu dīrsavayyā