మా కేల వెఱపు మగఁడవు నీ వుండఁగా
(॥పల్లవి॥)
మా కేల వెఱపు మగఁడవు నీ వుండఁగా
యే కొలఁది కా కొలఁది యెనసేము గాకా
(॥మాకేల॥)
హత్తి నీ వేమి సేసినా నటు వూరకుండఁగ
చిత్తరువు వ్రాసిన చెలులమా
మత్తిలి నీ మాటలకు మారు మాటాడ కుండఁగ
పుత్తడిఁ జేసినయట్టి బొమ్మలమా
(॥మాకేల॥)
మెలుపున నీ విట్టె మెలఁగినట్లా మెలఁగి
నిలుచుండఁగ నీతోడి నీడలమా
అలరి పెరసతుల నంటఁగా నివ్వెఱఁ గంద
బలువైన గోడచేర్పు ప్రతిమలమా
(॥మాకేల॥)
అంచెలఁ జెనకఁగా నే మట్టే సిగ్గువడ నీవు
కంచునఁ గట్టి పోసిన కరుగులమా
కొంచక శ్రీవేంకటేశ కూడి నన్ను నవ్వించేవు
పొంచి ప్రాణమువోసిన బొమ్మలమా
(||pallavi||)
mā kela vĕṟabu magam̐ḍavu nī vuṁḍam̐gā
ye kŏlam̐di kā kŏlam̐di yĕnasemu gāgā
(||māgela||)
hatti nī vemi sesinā naḍu vūraguṁḍam̐ga
sittaruvu vrāsina sĕlulamā
mattili nī māḍalagu māru māḍāḍa kuṁḍam̐ga
puttaḍim̐ jesinayaṭṭi bŏmmalamā
(||māgela||)
mĕlubuna nī viṭṭĕ mĕlam̐ginaṭlā mĕlam̐gi
nilusuṁḍam̐ga nīdoḍi nīḍalamā
alari pĕrasadula naṁṭam̐gā nivvĕṟam̐ gaṁda
baluvaina goḍaserbu pradimalamā
(||māgela||)
aṁchĕlam̐ jĕnagam̐gā ne maṭṭe sigguvaḍa nīvu
kaṁchunam̐ gaṭṭi posina karugulamā
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍi nannu navviṁchevu
pŏṁchi prāṇamuvosina bŏmmalamā