Maa kaabani gaadu maanivibaim dappuledu

మా కాపని గాదు మానివిపైఁ దప్పులేదు
Language

(॥పల్లవి॥)
మా కాపని గాదు మానివిపైఁ దప్పులేదు
చేకొన్న నాయకుఁడవు నీకడమే పో

(॥వకా॥)
సిగ్గుల వెలితేకాని చేఁతలవెలితి లేదు
యెగ్గువట్టేవుసుమ్మీ నీ వీయింతిని
దిగ్గన నాకెసిబ్బితి తేరుచ కుండితే నేఁడు
నిగ్గుల నింతటిమీఁద నీకడ మేపొ

(॥వకా॥)
పంతముచలమే కాని పాయము వెలితి లేదు
వంతువాసు లెంచి మోము వంచేవుసుమ్మీ
చెఁతల బుజముమీఁద చేయివేసి కుచముల
ఇంతటఁ బట్టకుండితే యీకడమేపో

(॥వకా॥)
రాఁపైనకడమేకాని రతులవెలితి లేదు
కొపగించెనంటాను కొంకెవుసుమ్మీ
యేపున శ్రీవేంకటేశ ఇంతి నిన్నుఁ దానె కూడె
నీపడఁతి నెడసితే నీకడమేపో

(||pallavi||)
mā kābani gādu mānivibaim̐ dappuledu
segŏnna nāyagum̐ḍavu nīgaḍame po

(||vagā||)
siggula vĕlidegāni sem̐talavĕlidi ledu
yĕgguvaṭṭevusummī nī vīyiṁtini
diggana nāgĕsibbidi terusa kuṁḍide nem̐ḍu
niggula niṁtaḍimīm̐da nīgaḍa mebŏ

(||vagā||)
paṁtamusalame kāni pāyamu vĕlidi ledu
vaṁtuvāsu lĕṁchi momu vaṁchevusummī
sĕm̐tala bujamumīm̐da seyivesi kusamula
iṁtaḍam̐ baṭṭaguṁḍide yīgaḍamebo

(||vagā||)
rām̐painagaḍamegāni radulavĕlidi ledu
kŏbagiṁchĕnaṁṭānu kŏṁkĕvusummī
yebuna śhrīveṁkaḍeśha iṁti ninnum̐ dānĕ kūḍĕ
nībaḍam̐ti nĕḍaside nīgaḍamebo