Maa dikkemi soosevu maadimaadigi

మా దిక్కేమి చూచేవు మాటిమాటికి
Language

(॥పల్లవి॥)
మా దిక్కేమి చూచేవు మాటిమాటికి
సాదుఁగొయ్యతనాలకు సాదించవలదా

(॥మాది॥)
ఆడుమంటాఁ బాడుమంటా నలఇంచితివి చెలి
వేడుక కాఁడవై నీవు వేఁగినంతాను
వీడె మిమ్మనుచు నీవు వేగిరించే వప్పటిని
జాడల నీవోజ కాపె జంకించవలదా

(॥మాది॥)
రమ్మనుచుఁ బొమ్మనుచు రవ్వ సేసితివి చెలి
దిమ్మరి ఊడిగేలనే తెల్లవారెను
కమ్మి యిట్టె నవ్వుమంటా కాఁతాళించే వప్పటిని
కొమ్మ నీచేఁతలకును కోపించవలదా

(॥మాది॥)
వుండుమంటాఁ బండుమంటా వూరడించితివి చెలి
అండనే శ్రీ వేంకటేశ అంకెలఁ గూడి
చండి పెట్టి పాదాలొత్త సమకట్టే వప్పటిని
మెండు నీయాసలు చూచి మేర మీర వలదా

(||pallavi||)
mā dikkemi sūsevu māḍimāḍigi
sādum̐gŏyyadanālagu sādiṁchavaladā

(||mādi||)
āḍumaṁṭām̐ bāḍumaṁṭā nala̮iṁchidivi sĕli
veḍuga kām̐ḍavai nīvu vem̐ginaṁtānu
vīḍĕ mimmanusu nīvu vegiriṁche vappaḍini
jāḍala nīvoja kābĕ jaṁkiṁchavaladā

(||mādi||)
rammanusum̐ bŏmmanusu ravva sesidivi sĕli
dimmari ūḍigelane tĕllavārĕnu
kammi yiṭṭĕ navvumaṁṭā kām̐tāḽiṁche vappaḍini
kŏmma nīsem̐talagunu kobiṁchavaladā

(||mādi||)
vuṁḍumaṁṭām̐ baṁḍumaṁṭā vūraḍiṁchidivi sĕli
aṁḍane śhrī veṁkaḍeśha aṁkĕlam̐ gūḍi
saṁḍi pĕṭṭi pādālŏtta samagaṭṭe vappaḍini
mĕṁḍu nīyāsalu sūsi mera mīra valadā