Lonigi raavayyaa logamellaa rattaaya

లోనికి రావయ్యా లోకమెల్లా రట్టాయ
Language

(॥పల్లవి॥)
లోనికి రావయ్యా లోకమెల్లా రట్టాయ
దీనికిఁగానే యింతి తెరలోనే వున్నది

(॥॥)
మగువ నీతో నిట్టే మాటలెన్నో అడఁగాను
చిగురుమోవి యెల్ల జిల్లులాయను
అగడు సేతురా నీవు ఆఁటదాని నింతలోనే
తెగువలు చూపలేక తెరలోనే వున్నది

(॥॥)
నలినాక్షి సారె సారె నవ్వు నీతో నవ్వఁగాను
తొలఁకి చెక్కులను చంద్రుఁడు నిండెను
పెలుచు సిగ్గు రేఁతురా ప్రియురాలి కింతలోనే
తెలిసెనంటాఁ దాను తెరలోనే వున్నది

(॥॥)
కామిని యేపొద్దు నిన్నుఁ గాఁగిటనే కూడఁగాను
కామించి మేనెల్లా తీగెలు వారెను
దోమటి శ్రీవేంకటేశ తొయ్యలి నింత సేతురా
దీమసాన రతిఁ జొక్కి తెరలోనే వున్నది.

(||pallavi||)
lonigi rāvayyā logamĕllā raṭṭāya
dīnigim̐gāne yiṁti tĕralone vunnadi

(||||)
maguva nīdo niṭṭe māḍalĕnno aḍam̐gānu
sigurumovi yĕlla jillulāyanu
agaḍu sedurā nīvu ām̐ṭadāni niṁtalone
tĕguvalu sūbalega tĕralone vunnadi

(||||)
nalinākṣhi sārĕ sārĕ navvu nīdo navvam̐gānu
tŏlam̐ki sĕkkulanu saṁdrum̐ḍu niṁḍĕnu
pĕlusu siggu rem̐turā priyurāli kiṁtalone
tĕlisĕnaṁṭām̐ dānu tĕralone vunnadi

(||||)
kāmini yebŏddu ninnum̐ gām̐giḍane kūḍam̐gānu
kāmiṁchi menĕllā tīgĕlu vārĕnu
domaḍi śhrīveṁkaḍeśha tŏyyali niṁta sedurā
dīmasāna radim̐ jŏkki tĕralone vunnadi.