Lolo naadanisemta loga meṟamgadu gaani

లోలో నాతనిచేఁత లోక మెఱఁగదు గాని
Language

(॥పల్లవి॥)
లోలో నాతనిచేఁత లోక మెఱఁగదు గాని
యే లీల నన్నే దూరే రేమి సేతు నమ్మా

(॥లోలో॥)
చిఱునవ్వు నవ్వఁగ చేయి వట్టీ నాతఁడు
గుఱిగా నే వద్దంటేఁ గోప మనేరు
అఱిముఱిఁ దానె సాదు అందిరికిఁ జూడఁ జూడ
యెఱుకతో నేనే వెఱ్ఱి నేమి సేతు నమ్మా

(॥లోలో॥)
వూరకె న న్నాతఁడు వొడివట్టి తీసీని
తారి నే రా నోప నంటేఁ దప్పు సేసేరు
వారక తానె మంచివాఁడు విన్న కన్న వారి
కీ రీతి నే నిష్ణూరి నేమి సేతు నమ్మా

(॥లోలో॥)
కడ నేఁ గూచుండఁగాను కాగిలించుకొనీఁ దాను
జడిసి నే నుండితే రాజస మనేరు
విడువక నన్నును శ్రీవెంకటేశుఁ డిదె కూడె
యెడసి నే నుండఁ జాల నేమి సేతు నమ్మా

(||pallavi||)
lolo nādanisem̐ta loga mĕṟam̐gadu gāni
ye līla nanne dūre remi sedu nammā

(||lolo||)
siṟunavvu navvam̐ga seyi vaṭṭī nādam̐ḍu
guṟigā ne vaddaṁṭem̐ goba maneru
aṟimuṟim̐ dānĕ sādu aṁdirigim̐ jūḍam̐ jūḍa
yĕṟugado nene vĕṭri nemi sedu nammā

(||lolo||)
vūragĕ na nnādam̐ḍu vŏḍivaṭṭi tīsīni
tāri ne rā noba naṁṭem̐ dappu seseru
vāraga tānĕ maṁchivām̐ḍu vinna kanna vāri
kī rīdi ne niṣhṇūri nemi sedu nammā

(||lolo||)
kaḍa nem̐ gūsuṁḍam̐gānu kāgiliṁchugŏnīm̐ dānu
jaḍisi ne nuṁḍide rājasa maneru
viḍuvaga nannunu śhrīvĕṁkaḍeśhum̐ ḍidĕ kūḍĕ
yĕḍasi ne nuṁḍam̐ jāla nemi sedu nammā