లోకులు మెచ్చవలసి లోఁగితిఁగాని ఆతఁ
(॥పల్లవి॥)
లోకులు మెచ్చవలసి లోఁగితిఁగాని ఆతఁ
డేకడ నీపతి యౌట యెఱుఁగమే నేము
(॥లోకులు॥)
కోప మేలే తాప మేలే కొమ్మ నీకు నతఁడు న
న్నేపున యేమే యంటి యేమంటినే
పోపో చిల్లో యంటెపొల్లో యనేవు నీవు
యీపాటిదానవౌట యెఱుఁగమే నేము
(॥లోకులు॥)
మాట లేలే మూట లేలే మగువ యాతఁడునిను
యేటికో పిలిచితే నే నియ్యకొంటిని
గాటమున కయ్య మంటే కాలు దవ్వే వింతకుఁగా
యేటమోట్టే నీ వుండే దెఱుఁగమేనేము
(॥లోకులు॥)
సన్న లేలే చాయ లేలే సతి శ్రీవేంకటపతి
వున్నతిఁగూడఁగనే వొద్ది కైతినే
యెన్నికె నాతఁడు నీవు నే మౌదురో తొల్లి
యిన్నేసి వెడమాయ లెఱుఁగమే నేము
(||pallavi||)
logulu mĕchchavalasi lom̐gidim̐gāni ādam̐
ḍegaḍa nībadi yauḍa yĕṟum̐game nemu
(||logulu||)
koba mele tāba mele kŏmma nīgu nadam̐ḍu na
nnebuna yeme yaṁṭi yemaṁṭine
pobo sillo yaṁṭĕbŏllo yanevu nīvu
yībāḍidānavauḍa yĕṟum̐game nemu
(||logulu||)
māḍa lele mūḍa lele maguva yādam̐ḍuninu
yeḍigo piliside ne niyyagŏṁṭini
gāḍamuna kayya maṁṭe kālu davve viṁtagum̐gā
yeḍamoṭṭe nī vuṁḍe dĕṟum̐gamenemu
(||logulu||)
sanna lele sāya lele sadi śhrīveṁkaḍabadi
vunnadim̐gūḍam̐gane vŏddi kaidine
yĕnnigĕ nādam̐ḍu nīvu ne mauduro tŏlli
yinnesi vĕḍamāya lĕṟum̐game nemu