లోకమెల్లా మెచ్చ నీకు లోనైతిని
(॥పల్లవి॥)
లోకమెల్లా మెచ్చ నీకు లోనైతిని
కైకో నే నీమన్ననలు కనుఁగొనే నిఁకను
(॥లోక॥)
చేతులెత్తి మొక్కితిని చెరి కొలువూ జేసితి
యీతల నిఁకమీఁద మాయింట నుండేను
రాతిటనుండియు నిన్ను రమ్మని నేఁ బిలిచితి
నీతలఁ పెట్టున్నదో నే నెరఁగ నిఁకను
(॥లోక॥)
మాటలు నే నాడితిని మనసెల్లాఁ గంటిని
కోటి సేయ నిన్ను నాడఁ గొనియాడేను
పాటించి నీ కన్నివిన్నపములు నేఁ జేసితి
నీటున నెన్నటికిని నీవార మిఁకను
(॥లోక॥)
కన్నుల నవ్వితి నిన్నుఁ గాఁగిటఁ గూడితిని
మిన్నక నీరతి నాలో మెచ్చుకొనేను
వన్నెతో శ్రీవేంకటేశ వద్దనుండి పాయవు
యిన్నిటా నీసుద్దులెల్లా నియ్యకొంటి నిఁకను
(||pallavi||)
logamĕllā mĕchcha nīgu lonaidini
kaigo ne nīmannanalu kanum̐gŏne nim̐kanu
(||loga||)
sedulĕtti mŏkkidini sĕri kŏluvū jesidi
yīdala nim̐kamīm̐da māyiṁṭa nuṁḍenu
rādiḍanuṁḍiyu ninnu rammani nem̐ bilisidi
nīdalam̐ pĕṭṭunnado ne nĕram̐ga nim̐kanu
(||loga||)
māḍalu ne nāḍidini manasĕllām̐ gaṁṭini
koḍi seya ninnu nāḍam̐ gŏniyāḍenu
pāḍiṁchi nī kannivinnabamulu nem̐ jesidi
nīḍuna nĕnnaḍigini nīvāra mim̐kanu
(||loga||)
kannula navvidi ninnum̐ gām̐giḍam̐ gūḍidini
minnaga nīradi nālo mĕchchugŏnenu
vannĕdo śhrīveṁkaḍeśha vaddanuṁḍi pāyavu
yinniḍā nīsuddulĕllā niyyagŏṁṭi nim̐kanu