లోకపు నీ చేఁతలకు లోనే కాదా
(॥పల్లవి॥)
లోకపు నీ చేఁతలకు లోనే కాదా
నీకు మారుకొనియుండ నేరుపా నాకు
(॥లోకపు॥)
వుడివోని జవ్వనము వొడిఁగట్టుకొని నీతో
సడిఁబెట్టి యలుగఁగ సంగతే నాకు
చిడిముడి కోరికలు చిత్తములో నుండఁగాను
తడసి నిన్నుఁ బాయఁగ తగునా నాకు
(॥లోకపు॥)
వుప్పతిల్లుఁ జన్నులు వురమున మోచుకొని
చిప్పిల నీనేరా లెంచఁ జెల్లునా నాకు
ముప్పిరి మొగమోటలు మోముమీఁద నుండఁగాను
అప్పుడే నిన్నణకించ ననువా నాకు
(॥లోకపు॥)
నిండుకొన్నజవ్వనము నిలువునఁ బెట్టుకొని
చండసేసి పెన గఁగ సరవే నాకు
అండనే శ్రీవేంకటేశ అంతలో న న్నేలితివి
అండు కాచి దూరఁ దగ వవునా నాకు
(||pallavi||)
logabu nī sem̐talagu lone kādā
nīgu mārugŏniyuṁḍa nerubā nāgu
(||logabu||)
vuḍivoni javvanamu vŏḍim̐gaṭṭugŏni nīdo
saḍim̐bĕṭṭi yalugam̐ga saṁgade nāgu
siḍimuḍi korigalu sittamulo nuṁḍam̐gānu
taḍasi ninnum̐ bāyam̐ga tagunā nāgu
(||logabu||)
vuppadillum̐ jannulu vuramuna mosugŏni
sippila nīnerā lĕṁcham̐ jĕllunā nāgu
muppiri mŏgamoḍalu momumīm̐da nuṁḍam̐gānu
appuḍe ninnaṇagiṁcha nanuvā nāgu
(||logabu||)
niṁḍugŏnnajavvanamu niluvunam̐ bĕṭṭugŏni
saṁḍasesi pĕna gam̐ga sarave nāgu
aṁḍane śhrīveṁkaḍeśha aṁtalo na nnelidivi
aṁḍu kāsi dūram̐ daga vavunā nāgu