లోక మేలఁ బొద్దు లేదో లోన నుండఁ బొద్దులేదో
(॥పల్లవి॥)
లోక మేలఁ బొద్దు లేదో లోన నుండఁ బొద్దులేదో
చేకొందువు యింటికి విచ్చేయరాదా ఇఁకను
(॥లోక॥)
మచ్చికె మనసులోన మాటలలోఁ గొసరులు
ముచ్చట చెలులతోడ మొక్కులు చేత
నిచ్చనిచ్చ నిట్లానే నెలఁతకుఁ బను లాయ
రచ్చ కెక్కె వలపులు రారాదా ఇఁకను
(॥లోక॥)
కన్నులనే తమకము కాయములోఁ గరఁగులు
చన్నులపై నరుపులు జారులఁగొప్పు
ఆకన్నెకు నీరీతు లాయ కాఁపురము వేగి లేచి
పన్ను గడ లాయ మేలు పదరాదా ఇఁకను
(॥లోక॥)
చెక్కులనే చెమటలు చెవుల నీయాలకింపు
అక్కర నీపాటలపై నా రతుల
గక్కన శ్రీవేంకటేశ కలసితి వింతి నిట్టె
యిక్కునపానువుమీఁది కేఁగరాదా యిఁకను
(||pallavi||)
loga melam̐ bŏddu ledo lona nuṁḍam̐ bŏdduledo
segŏṁduvu yiṁṭigi vichcheyarādā im̐kanu
(||loga||)
machchigĕ manasulona māḍalalom̐ gŏsarulu
muchchaḍa sĕluladoḍa mŏkkulu seda
nichchanichcha niṭlāne nĕlam̐tagum̐ banu lāya
rachcha kĕkkĕ valabulu rārādā im̐kanu
(||loga||)
kannulane tamagamu kāyamulom̐ garam̐gulu
sannulabai narubulu jārulam̐gŏppu
āgannĕgu nīrīdu lāya kām̐puramu vegi lesi
pannu gaḍa lāya melu padarādā im̐kanu
(||loga||)
sĕkkulane sĕmaḍalu sĕvula nīyālagiṁpu
akkara nībāḍalabai nā radula
gakkana śhrīveṁkaḍeśha kalasidi viṁti niṭṭĕ
yikkunabānuvumīm̐di kem̐garādā yim̐kanu