Leve yemta ledu yee lemtamaayalu

లేవే యెంత లేదు యీ లేఁతమాయలు
Language

(॥పల్లవి॥)
లేవే యెంత లేదు యీ లేఁతమాయలు
వావు లేల చెప్పవచ్చీ వద్దు వద్దు యింకను

(॥లేవే॥)
మానిని వానితో మాటలాడే వప్పటిని
పూని నిన్న వచ్చెనా పో పో తాను
తానే పనికి వచ్చీ తలవాకిట మొక్కవే
ఆన లెన్ని వెట్టుకొన్నా నవి నేఁడు నిజమా

(॥లేవే॥)
పిలిచి వానికే పీఁట వెట్టే వప్పటిని
సొలసి వాఁ డున్నజాడచూడవా నీవు
నిలిచి పోకుండితేనే నీ కేల దయ వుట్టీనే
కులసాజమే వానికి గామిడితనములు

(॥లేవే॥)
అట్టే వాఁడు చెనక నడ్డమురా వప్పటిని
గుట్టున నేఁ డింతలోనే కూడెఁగా తాను
యిట్టే శ్రీవేంకటేశు నిందుల కింక మెచ్చవే
శుట్టినచలము చెల్ల పైకొనెఁగా నన్నును

(||pallavi||)
leve yĕṁta ledu yī lem̐tamāyalu
vāvu lela sĕppavachchī vaddu vaddu yiṁkanu

(||leve||)
mānini vānido māḍalāḍe vappaḍini
pūni ninna vachchĕnā po po tānu
tāne panigi vachchī talavāgiḍa mŏkkave
āna lĕnni vĕṭṭugŏnnā navi nem̐ḍu nijamā

(||leve||)
pilisi vānige pīm̐ṭa vĕṭṭe vappaḍini
sŏlasi vām̐ ḍunnajāḍasūḍavā nīvu
nilisi poguṁḍidene nī kela daya vuṭṭīne
kulasājame vānigi gāmiḍidanamulu

(||leve||)
aṭṭe vām̐ḍu sĕnaga naḍḍamurā vappaḍini
guṭṭuna nem̐ ḍiṁtalone kūḍĕm̐gā tānu
yiṭṭe śhrīveṁkaḍeśhu niṁdula kiṁka mĕchchave
śhuṭṭinasalamu sĕlla paigŏnĕm̐gā nannunu