Leve yemdaamkaanu lekkalu vettevu

లేవే యెందాఁకాను లెక్కలు వెట్టేవు
Language

(॥పల్లవి॥)
లేవే యెందాఁకాను లెక్కలు వెట్టేవు
ఆవటించి పైకొంటే నాయములు రేఁగును

(॥లేవే॥)
యెదురుమాటలాడితే నెన్నైనాఁ గలవు
పొదిగి కాఁగిలించితే పొందు చేకూరు
చదురులాడఁజూచితే సరియాఁకలై యుండు
అదన మోవియానితే నడ్డాఁక లేదు

(॥లేవే॥)
పనులు విచారించితే బండ్లకొలఁదులు
ననిచి రతిసేసితే నాఁడే పెండ్లి
పెనఁగఁబోతే కడుబిగియ మనసువుట్టు
చెనకి పై కొంటేను చేతఁ జిక్కు వలపు

(॥లేవే॥)
కొచ్చి సిగ్గువడితేను కొండలౌను జగమెల్లా
పచ్చిగా రతిసేసితే బట్టబయలు
యిచ్చట శ్రీవేంకటేశుఁ డెనసె నేఁ డింతలోనె
ఇచ్చగించితే నట్టే యితవౌఁ దమకము

(||pallavi||)
leve yĕṁdām̐kānu lĕkkalu vĕṭṭevu
āvaḍiṁchi paigŏṁṭe nāyamulu rem̐gunu

(||leve||)
yĕdurumāḍalāḍide nĕnnainām̐ galavu
pŏdigi kām̐giliṁchide pŏṁdu segūru
sadurulāḍam̐jūside sariyām̐kalai yuṁḍu
adana moviyānide naḍḍām̐ka ledu

(||leve||)
panulu visāriṁchide baṁḍlagŏlam̐dulu
nanisi radiseside nām̐ḍe pĕṁḍli
pĕnam̐gam̐bode kaḍubigiya manasuvuṭṭu
sĕnagi pai kŏṁṭenu sedam̐ jikku valabu

(||leve||)
kŏchchi sigguvaḍidenu kŏṁḍalaunu jagamĕllā
pachchigā radiseside baṭṭabayalu
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ nem̐ ḍiṁtalonĕ
ichchagiṁchide naṭṭe yidavaum̐ damagamu