లేవయ్య నీ కెంతలేదు లేమతోడను
(॥పల్లవి॥)
లేవయ్య నీ కెంతలేదు లేమతోడను
చేవదేరిన పనికి సిగ్గు లిఁకనేల
(॥లేవ॥)
మంతనానఁ గూచుండి మగువపైఁ జేయివేసి
చింతలు దీరుచరాదా చెలియకును
వంతులకే పెనఁగీని వాసులే పంచీ నాపె
పంతమా నీ కింతితోడ బలుమగవాఁడవు
(॥లేవ॥)
మంచముపైఁ బవళించి మర్మములు సోఁకించి
చంచలము దీర్చరాదా సకియకును
ముంచి నీపైఁ గొసరులే మోహము చల్లీ నాపె
కొంచెమా నీ వియ్యకొంటే కొండవంటిదొరవు
(॥లేవ॥)
కన్నుఁగొనలను నవ్వి కాఁగిట శ్రీవేంకటేశ
యిన్నిటా నీ వెనసితి వీసతితోను
మన్ననకే అసపడి మాటలఁ జొక్కీ నాపె
యెన్నికా నీ కిందువల్ల ఇంతదొడ్డవాఁడవు
(||pallavi||)
levayya nī kĕṁtaledu lemadoḍanu
sevaderina panigi siggu lim̐kanela
(||leva||)
maṁtanānam̐ gūsuṁḍi maguvabaim̐ jeyivesi
siṁtalu dīrusarādā sĕliyagunu
vaṁtulage pĕnam̐gīni vāsule paṁchī nābĕ
paṁtamā nī kiṁtidoḍa balumagavām̐ḍavu
(||leva||)
maṁchamubaim̐ bavaḽiṁchi marmamulu som̐kiṁchi
saṁchalamu dīrsarādā sagiyagunu
muṁchi nībaim̐ gŏsarule mohamu sallī nābĕ
kŏṁchĕmā nī viyyagŏṁṭe kŏṁḍavaṁṭidŏravu
(||leva||)
kannum̐gŏnalanu navvi kām̐giḍa śhrīveṁkaḍeśha
yinniḍā nī vĕnasidi vīsadidonu
mannanage asabaḍi māḍalam̐ jŏkkī nābĕ
yĕnnigā nī kiṁduvalla iṁtadŏḍḍavām̐ḍavu