Lessaayamgaa nemdu nee lekkaleni sarasaalu

లెస్సాయఁగా నేఁడు నీ లెక్కలేని సరసాలు
Language

(॥పల్లవి॥)
లెస్సాయఁగా నేఁడు నీ లెక్కలేని సరసాలు
అస్సారముగా వలపు లారడిఁ బేట్టేవు

(॥॥)
నమ్మికిచ్చి తెచ్చి నేఁడు నలినాక్షిఁ బెండ్లాడి
వుమ్మడి జూజాలాడేవు వూరిలోనెల్లా
సమ్మతిగాఁ జన్నులంటి జవ్వనము పెడరేఁచి
పమ్మి పరాకుసేసుక పాటలువాడేవు

(॥॥)
ఆసలెల్లాఁ బెట్టి పెట్టి ఆయములు గరఁగించి
తోసిపార గుఱ్ఱాల వీదులఁ దోలేవు
బాససేసి యేకతాన పలురతులెల్లా నేర్పి
వేసాలకు సాములు వేమారుఁ జేసేవు

(॥॥)
తేటమాటలాడి మోవితేనియ చవిమరపి
పాటించి పానుపుమీఁదఁ బవళించేవు
గాఁటాన శ్రీ వేంకటేశ కలికి నేలితి విట్టె
నాటకపుసిగ్గులను నవ్వులు నవ్వేవు

(||pallavi||)
lĕssāyam̐gā nem̐ḍu nī lĕkkaleni sarasālu
assāramugā valabu lāraḍim̐ beṭṭevu

(||||)
nammigichchi tĕchchi nem̐ḍu nalinākṣhim̐ bĕṁḍlāḍi
vummaḍi jūjālāḍevu vūrilonĕllā
sammadigām̐ jannulaṁṭi javvanamu pĕḍarem̐si
pammi parāgusesuga pāḍaluvāḍevu

(||||)
āsalĕllām̐ bĕṭṭi pĕṭṭi āyamulu garam̐giṁchi
tosibāra guṭrāla vīdulam̐ dolevu
bāsasesi yegadāna paluradulĕllā nerbi
vesālagu sāmulu vemārum̐ jesevu

(||||)
teḍamāḍalāḍi movideniya savimarabi
pāḍiṁchi pānubumīm̐dam̐ bavaḽiṁchevu
gām̐ṭāna śhrī veṁkaḍeśha kaligi nelidi viṭṭĕ
nāḍagabusiggulanu navvulu navvevu