Lessa buddhi seppare lema limdarum goodi

లెస్స బుద్ధి చెప్పరే లేమ లిందరుఁ గూడి
Language

(॥పల్లవి॥)
లెస్స బుద్ధి చెప్పరే లేమ లిందరుఁ గూడి
వుస్సు రస్సు రనఁగానె వొద్దికి నేఁ బోదునా

(॥లెస్స॥)
పై పై నవ్వేవారితోడ పలుకఁగ వచ్చుఁగాక
కోపగించఁగా కూరిమి గొసరఁగ వచ్చునా
యేపున రమణుఁ డయితే యెదురు రా నైతి నంటా
ఆఁప లేక తిట్టఁగాను అండకుఁ బిలుతునా

(॥లెస్స॥)
వలచినవారితోడ వా దైన నమరుఁ గాక
యిలఁ బగవారితోడ యిచ్చకము చెల్లునా
కులికి యప్పుడు నేను గోరు దాఁకించితి నంటా
అలిగేటివానికే ఆకుమడి చిత్తునా

(॥లెస్స॥)
ఆదరించేవారితోడ నంటి పొందవలెఁ గాక
గోదిలేటి మగవాని కొంగు వట్ట వచ్చునా
యీదెస శ్రీవెంకటేశుఁ డింత నేసి నన్నుఁ గూడె
పాదుకొని వుండఁగాను పంత మిచ్చే నందునా

(||pallavi||)
lĕssa buddhi sĕppare lema liṁdarum̐ gūḍi
vussu rassu ranam̐gānĕ vŏddigi nem̐ bodunā

(||lĕssa||)
pai pai navvevāridoḍa palugam̐ga vachchum̐gāga
kobagiṁcham̐gā kūrimi gŏsaram̐ga vachchunā
yebuna ramaṇum̐ ḍayide yĕduru rā naidi naṁṭā
ām̐pa lega tiṭṭam̐gānu aṁḍagum̐ biludunā

(||lĕssa||)
valasinavāridoḍa vā daina namarum̐ gāga
yilam̐ bagavāridoḍa yichchagamu sĕllunā
kuligi yappuḍu nenu goru dām̐kiṁchidi naṁṭā
aligeḍivānige āgumaḍi sittunā

(||lĕssa||)
ādariṁchevāridoḍa naṁṭi pŏṁdavalĕm̐ gāga
godileḍi magavāni kŏṁgu vaṭṭa vachchunā
yīdĕsa śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁta nesi nannum̐ gūḍĕ
pādugŏni vuṁḍam̐gānu paṁta michche naṁdunā