(॥పల్లవి॥)
లేరా దేవతలూ లేరా లావరులూ
ఆ రీతి నాఁ డెందు వోయి రధికులే కలిగితే*
(॥లేరా॥)
మొదల సృష్టికి నెల్ల మూలమైన బ్రహ్మదేవుని - యదె నాభిఁ బొడమించే నచ్యుతుఁడే
తుదఁ బ్రళయమునందు దొంతులుగా జగములు - వుదరమునందు నించె నొక్కఁడే నిలిచి
(॥లేరా॥)
మోవలేక దేవతలు ములుగఁగ మందరము - తోవ మోచి తెచ్చినట్టి దొరవిష్ణువే
వేవేగ జలధిలోన వేసితే కుంగిన కొండ - ఆవల వీఁపున నెత్తె నాదికూర్మ మితఁడే
(॥లేరా॥)
తనబంటు శేషుని తరితాడు గావించి - కొననాధారమై నిలిచె గోవిందుఁడే
దనుజులు దేవతలు తచ్చి తచ్చి యలనితె - వెనక నంతయుఁ దచ్చె విశ్వరూపుఁడితఁడే
(॥లేరా॥)
కాలకూటమున కీశుఁ గంచముగాఁ జేసి మింగి - చాలి నీలవర్ణుఁ డాయె శశివర్ణుఁడే
కాలకంఠుడాయెను శంకరుఁడు పాత్రయిన వంక - పోలింప ఋగ్వేద మిదె పొగడీ నితనిని
(॥లేరా॥)
అమరఁ తనయిచ్చ నమృతము పంచిపెట్టె - నమరుల కెల్లా నారాయణుఁ డితఁడె
నెమకి తా ననువైన నిర్మల కౌస్తుభము - కమలము పై లక్ష్మిఁ గైకొనె నీ ఘనుఁడె
(॥లేరా॥)
మూలమని నుడిగితే మోచివచ్చి కరిఁగాచె - కోలుముందై యిందరిలో గోవిందుఁడే
తూలిన శ్రుతులు దెచ్చి తుంగిన భూమియెత్తె - అలరి భస్మామురుని నడఁచె నీ దేవుఁడే
(॥లేరా॥)
యిందు మౌళిపై నేసి యింద్రియములఁ గట్టిన- కందర్పజనకుఁడైన కమలాక్షుఁడే
కందువ పాదతీర్థపు గంగ హరు శిర మెక్కె - యెందును దైవ మితఁడే యిందిరానాథుఁడు
(॥లేరా॥)
మాయలెల్లా నితనివె మహిలో సంకల్పములు - యేయెడ ‘శ్రీవిష్ణురాజ్ఞ’ యీతనిదే
తోయరాని చక్రముచే దుర్వాసు వారఁగాను - దాయి దండై బ్రదికించె తనబంటు చేత
(॥లేరా॥)
సంది నన్నిమతముల సన్యాసులకు గతియై - అందరి నోళ్లకు నారాయణు నామమే
ముందు సంధ్యాజపముల మూలపు టాచమనము - అందుల కితని కేశవాది నామములె
(॥లేరా॥)
వాదుల ‘నదైవం కేశవాత్సర’ మని తొల్లి- వేదవ్యాసులనిన విభుఁడీ హరి
సోదించి వశిష్టుడును శుకనారదాదులు - పోదితోడ దాసులైరి పురుషోత్తమునికి
(॥లేరా॥)
బాణాసురుని నఱకి భంగపడఁగా విడిచె-వేణునాదప్రియుడైన విఠ్ఠలుఁడే
బాణమై త్రిపురములు భస్మీకరము చేసె - ప్రాణుల రక్షించే నీ పరమాత్ముఁడే
(॥లేరా॥)
ఆపదలందినవేళ యసురబాధలు మాన్ప- చేపట్టిలోకము గాచే శ్రీపతియే
పై పై నింద్రాదులకు పారిజాతాదిసిరులు- వైపుగాఁ గాయించిన వరదుఁడు నితఁడే
(॥లేరా॥)
భూమి యీతనిసతి యంబుదు లితని పరపు - సోమ సూసౌదు లితని చూపుఁగన్నులు
వేమరు నూర్పులే గాలి విష్ణుపద మాకాశము - వాములైన హరి నీ వాసుదేవుఁడే
(॥లేరా॥)
హరువిఁ బూజించవలె నంటె నర్జునునక - సిరులఁ బాదము చాఁచె శ్రీకృష్ణుఁడే
అరిది మార్కండేయుఁ డతని మహిమ చూచి - వరదైవా మితఁ డని వాదించి కొలిచె
(॥లేరా॥)
ధృవపట్ట మితఁ డిచ్చె దొరకొని శరణంటే - వివరింప నిదివో శ్రీవేంకటేశుఁడే
యివల నితనిఁ జెప్పనెవ్వరివశము లింక - భువిఁ బార్వతి హరినిఁ బొగడేటినాఁడు
(||pallavi||)
lerā devadalū lerā lāvarulū
ā rīdi nām̐ ḍĕṁdu voyi radhigule kaligide*
(||lerā||)
mŏdala sṛṣhṭigi nĕlla mūlamaina brahmadevuni - yadĕ nābhim̐ bŏḍamiṁche nachyudum̐ḍe
tudam̐ braḽayamunaṁdu dŏṁtulugā jagamulu - vudaramunaṁdu niṁchĕ nŏkkam̐ḍe nilisi
(||lerā||)
movalega devadalu mulugam̐ga maṁdaramu - tova mosi tĕchchinaṭṭi dŏraviṣhṇuve
vevega jaladhilona veside kuṁgina kŏṁḍa - āvala vīm̐puna nĕttĕ nādigūrma midam̐ḍe
(||lerā||)
tanabaṁṭu śheṣhuni taridāḍu gāviṁchi - kŏnanādhāramai nilisĕ goviṁdum̐ḍe
danujulu devadalu tachchi tachchi yalanidĕ - vĕnaga naṁtayum̐ dachchĕ viśhvarūbum̐ḍidam̐ḍe
(||lerā||)
kālagūḍamuna kīśhum̐ gaṁchamugām̐ jesi miṁgi - sāli nīlavarṇum̐ ḍāyĕ śhaśhivarṇum̐ḍe
kālagaṁṭhuḍāyĕnu śhaṁkarum̐ḍu pātrayina vaṁka - poliṁpa ṛgveda midĕ pŏgaḍī nidanini
(||lerā||)
amaram̐ tanayichcha namṛtamu paṁchibĕṭṭĕ - namarula kĕllā nārāyaṇum̐ ḍidam̐ḍĕ
nĕmagi tā nanuvaina nirmala kaustubhamu - kamalamu pai lakṣhmim̐ gaigŏnĕ nī ghanum̐ḍĕ
(||lerā||)
mūlamani nuḍigide mosivachchi karim̐gāsĕ - kolumuṁdai yiṁdarilo goviṁdum̐ḍe
tūlina śhrudulu dĕchchi tuṁgina bhūmiyĕttĕ - alari bhasmāmuruni naḍam̐sĕ nī devum̐ḍe
(||lerā||)
yiṁdu mauḽibai nesi yiṁdriyamulam̐ gaṭṭina- kaṁdarbajanagum̐ḍaina kamalākṣhum̐ḍe
kaṁduva pādadīrdhabu gaṁga haru śhira mĕkkĕ - yĕṁdunu daiva midam̐ḍe yiṁdirānāthum̐ḍu
(||lerā||)
māyalĕllā nidanivĕ mahilo saṁkalbamulu - yeyĕḍa ‘śhrīviṣhṇurājña’ yīdanide
toyarāni sakramuse durvāsu vāram̐gānu - dāyi daṁḍai bradigiṁchĕ tanabaṁṭu seda
(||lerā||)
saṁdi nannimadamula sanyāsulagu gadiyai - aṁdari noḽlagu nārāyaṇu nāmame
muṁdu saṁdhyājabamula mūlabu ṭāsamanamu - aṁdula kidani keśhavādi nāmamulĕ
(||lerā||)
vādula ‘nadaivaṁ keśhavātsara’ mani tŏlli- vedavyāsulanina vibhum̐ḍī hari
sodiṁchi vaśhiṣhṭuḍunu śhuganāradādulu - podidoḍa dāsulairi puruṣhottamunigi
(||lerā||)
bāṇāsuruni naṟagi bhaṁgabaḍam̐gā viḍisĕ-veṇunādapriyuḍaina viṭhṭhalum̐ḍe
bāṇamai triburamulu bhasmīgaramu sesĕ - prāṇula rakṣhiṁche nī paramātmum̐ḍe
(||lerā||)
ābadalaṁdinaveḽa yasurabādhalu mānpa- sebaṭṭilogamu gāse śhrībadiye
pai pai niṁdrādulagu pārijādādisirulu- vaibugām̐ gāyiṁchina varadum̐ḍu nidam̐ḍe
(||lerā||)
bhūmi yīdanisadi yaṁbudu lidani parabu - soma sūsaudu lidani sūbum̐gannulu
vemaru nūrbule gāli viṣhṇubada māgāśhamu - vāmulaina hari nī vāsudevum̐ḍe
(||lerā||)
haruvim̐ būjiṁchavalĕ naṁṭĕ narjununaga - sirulam̐ bādamu sām̐sĕ śhrīkṛṣhṇum̐ḍe
aridi mārgaṁḍeyum̐ ḍadani mahima sūsi - varadaivā midam̐ ḍani vādiṁchi kŏlisĕ
(||lerā||)
dhṛvabaṭṭa midam̐ ḍichchĕ dŏragŏni śharaṇaṁṭe - vivariṁpa nidivo śhrīveṁkaḍeśhum̐ḍe
yivala nidanim̐ jĕppanĕvvarivaśhamu liṁka - bhuvim̐ bārvadi harinim̐ bŏgaḍeḍinām̐ḍu