Leni visaaramulela leve yimka

లేని విచారములేల లేవే యింక
Language

(॥పల్లవి॥)
లేని విచారములేల లేవే యింక
మానుపడి వుండనేల మానవే యింత

(॥లేని॥)
చెలువుని తురుమిది చెదరితే నేమాయ
వలపు రట్టు సేతురా వద్దే యింత
అలసి సొలసి వుస్సరంటే నిందేమాయ
చలివాయ నాడనేల చాలదా యింత

(॥లేని॥)
రమణుఁ డింతటనే పరాకైతే నేమాయ
తమకము చెరుతురా తగదే యింత
అమరినమరు రేక లవి యుంటే నేమాయ
కొమరుమిగిలినాఁడు కోపేమేలే యింత

(॥లేని॥)
వాడుమోము నీయెదుట వంచితేనే యేమాయ
వీడనాడఁ బనిలేదు విడవే యింత
వేడుకతో నిన్నునే శ్రీ వేంకటేశుఁ డిటు గూడె
పాడిఁబంతమెల్లాఁ జెల్లె బాసలేలే యింత

(||pallavi||)
leni visāramulela leve yiṁka
mānubaḍi vuṁḍanela mānave yiṁta

(||leni||)
sĕluvuni turumidi sĕdaride nemāya
valabu raṭṭu sedurā vadde yiṁta
alasi sŏlasi vussaraṁṭe niṁdemāya
salivāya nāḍanela sāladā yiṁta

(||leni||)
ramaṇum̐ ḍiṁtaḍane parāgaide nemāya
tamagamu sĕrudurā tagade yiṁta
amarinamaru rega lavi yuṁṭe nemāya
kŏmarumigilinām̐ḍu kobemele yiṁta

(||leni||)
vāḍumomu nīyĕduḍa vaṁchidene yemāya
vīḍanāḍam̐ baniledu viḍave yiṁta
veḍugado ninnune śhrī veṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕ
pāḍim̐baṁtamĕllām̐ jĕllĕ bāsalele yiṁta