Lelevayya yemi seppevu lekkaleni suddulellaa

లేలేవయ్య యేమి చెప్పేవు లెక్కలేని సుద్దులెల్లా
Language

(॥పల్లవి॥)
(లే)లేవయ్య యేమి చెప్పేవు లెక్కలేని సుద్దులెల్లా
కాలు దొక్కఁగానేఁ గసరేనా నీతోను

(॥లేవ॥)
చేరి చేరి నీకు నేను సేవ సేయఁగలఁ గాక
ఆరి తేరి కడుదూరే అందుకోపేనా
కోరి నేఁ బ్రియము చెప్పి కొసర నోపుదు గాక
బీరానఁ జెనకఁగా నేఁ బెనఁగేనా నీతోను

(॥లేవ॥)
కాయము నీపై మోపి కళలు రేఁతుఁగాక
చాయల సన్నల నిన్ను సాదింతునా
పాయక నీవొద్దనుండి పాదము లొత్తుదుఁ గాక
వేయిటికైనాఁ గడు వేసరింతునా

(॥లేవ॥)
చెక్కులు నీకు నొక్కి సేలు చల్లుట(గాక
కక్కసించి గోరగీరి కాఁతాళింతునా
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వొక్కటె నిన్ను రతుల నోడించ వచ్చునా

(||pallavi||)
(le)levayya yemi sĕppevu lĕkkaleni suddulĕllā
kālu dŏkkam̐gānem̐ gasarenā nīdonu

(||leva||)
seri seri nīgu nenu seva seyam̐galam̐ gāga
āri teri kaḍudūre aṁdugobenā
kori nem̐ briyamu sĕppi kŏsara nobudu gāga
bīrānam̐ jĕnagam̐gā nem̐ bĕnam̐genā nīdonu

(||leva||)
kāyamu nībai mobi kaḽalu rem̐tum̐gāga
sāyala sannala ninnu sādiṁtunā
pāyaga nīvŏddanuṁḍi pādamu lŏttudum̐ gāga
veyiḍigainām̐ gaḍu vesariṁtunā

(||leva||)
sĕkkulu nīgu nŏkki selu salluḍa(gāga
kakkasiṁchi goragīri kām̐tāḽiṁtunā
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
vŏkkaḍĕ ninnu radula noḍiṁcha vachchunā