లేలే యిది యంత లేదు లేమలాల
(॥పల్లవి॥)
లేలే యిది యంత లేదు లేమలాల
కాలమందే మన మిది కన్నది గాదా
(॥లేలే॥)
వల పింత గలవాడు వడి నే నలిగి రాఁగా
పిలిచి మాఁటాడ రాదా ప్రియుఁ డప్పుడే
తలఁచుక తలఁచుక తానేఁ డెవ్వరితోను
బెళకుప్రియాలు చెప్పి బేరి బోకొట్టీనే
(॥లేలే॥)
తగ వెరిఁగినవాడు తారుకాణించఁగ నాతో
నగవు సేసుక నన్ను నమ్మించ రాదా
సగము సగము గొంకి సత్యము లెవ్వరితోడ
నిగిడించి మొక్కి యేరు నిద్దుర వుచ్చీనే
(॥లేలే॥)
గక్కనఁ గూడెటివాఁడు కన్నీరు నించఁగాను
అక్కరతో నా వగ పారుచ రాదా
యెక్కు శ్రీవెంకటేశుఁ డిప్పుడుగా నన్నుఁ బొందె
మిక్కిలి చెరువునీళ్ల మేలు వడసీనే
(||pallavi||)
lele yidi yaṁta ledu lemalāla
kālamaṁde mana midi kannadi gādā
(||lele||)
vala piṁta galavāḍu vaḍi ne naligi rām̐gā
pilisi mām̐ṭāḍa rādā priyum̐ ḍappuḍe
talam̐suga talam̐suga tānem̐ ḍĕvvaridonu
bĕḽagupriyālu sĕppi beri bogŏṭṭīne
(||lele||)
taga vĕrim̐ginavāḍu tārugāṇiṁcham̐ga nādo
nagavu sesuga nannu nammiṁcha rādā
sagamu sagamu gŏṁki satyamu lĕvvaridoḍa
nigiḍiṁchi mŏkki yeru niddura vuchchīne
(||lele||)
gakkanam̐ gūḍĕḍivām̐ḍu kannīru niṁcham̐gānu
akkarado nā vaga pārusa rādā
yĕkku śhrīvĕṁkaḍeśhum̐ ḍippuḍugā nannum̐ bŏṁdĕ
mikkili sĕruvunīḽla melu vaḍasīne