Lele yaabe titlu lekkasese vippu ditte

లేలే యాపె తిట్లు లెక్కసేసే విప్పు డిట్టె
Language

(॥పల్లవి॥)
లేలే యాపె తిట్లు లెక్కసేసే విప్పు డిట్టె
చాలుఁజాలు మీకు లోలో చవులు గావా

(॥లేలే॥)
తగవు లెన్నేసి లేవు దగ్గరి నీవు చెప్పితే
వెగటైన యందాఁక విందునే నేను
యిగురుఁబోఁడికి నీకు నెప్పుడునుఁ గలదే
పగుటున నాపె నీకు ప్రాణము గాదా

(॥లేలే॥)
తారుకాణ యెంతలేదు తగవు నిలిపితే
కూరిమి నెందాఁకాఁ గనుఁగొందుము నేము
యీరీతి తచ్చనలు యిద్దరికిఁ గలదే
కోరినట్టె యాపె నీకు కొంగుపైఁడి గాదా

(॥లేలే॥)
చందాలు సే సేకొనేవు సరి నాపెలోనైతే
యెందాఁకా నవ్వుదును యిందుకు నేను
చెంది నన్ను నేలితివి శ్రీ వేంకటేశ్వర నీవు
నిందలేక యాపెప్పుడు నీ నేస్తకత్తెకాదా

(||pallavi||)
lele yābĕ tiṭlu lĕkkasese vippu ḍiṭṭĕ
sālum̐jālu mīgu lolo savulu gāvā

(||lele||)
tagavu lĕnnesi levu daggari nīvu sĕppide
vĕgaḍaina yaṁdām̐ka viṁdune nenu
yigurum̐bom̐ḍigi nīgu nĕppuḍunum̐ galade
paguḍuna nābĕ nīgu prāṇamu gādā

(||lele||)
tārugāṇa yĕṁtaledu tagavu nilibide
kūrimi nĕṁdām̐kām̐ ganum̐gŏṁdumu nemu
yīrīdi tachchanalu yiddarigim̐ galade
korinaṭṭĕ yābĕ nīgu kŏṁgubaim̐ḍi gādā

(||lele||)
saṁdālu se segŏnevu sari nābĕlonaide
yĕṁdām̐kā navvudunu yiṁdugu nenu
sĕṁdi nannu nelidivi śhrī veṁkaḍeśhvara nīvu
niṁdalega yābĕppuḍu nī nestagattĕgādā