లేలే వేసాలమాటలే యాడే వప్పటిని
(॥పల్లవి॥)
లేలే వేసాలమాటలే యాడే వప్పటిని
పేలరితనాలు నీతోఁ బెంచవచ్చేమా
(॥లేలే॥)
వున్నతి నేఁ గదిమితే వొడ్డించుకొనేవు నా
చన్నుల మొనలు నిన్ను సాదించీనా
సన్నలు సేసి తేనె జడిసే వంతటిలోనే
కన్నుల తేటలు నిన్నుఁ గరఁగించీనా
(॥లేలే॥)
కేలెత్తి మొక్కితేను కెరలి యానవెట్టేవు
వాలారుగోళ్లు నిన్ను వంచుకొనీనా
మేలములాడితేనే మెత్తనై వసివాడేవు
యేల మాఁటలు మర్మము లెత్తిపెట్టీనా
(॥లేలే॥)
యిక్కువ లంటితేను యిట్టె నన్ను దూరేవు
గక్కున కాఁగిలి నిన్నుఁ గట్టివేసీనా
తక్కక శ్రీవేంకటేశ తగిలి నన్నేలితివి
పెక్కులైనరతులెల్లా పెడరేఁచీనా
(||pallavi||)
lele vesālamāḍale yāḍe vappaḍini
pelaridanālu nīdom̐ bĕṁchavachchemā
(||lele||)
vunnadi nem̐ gadimide vŏḍḍiṁchugŏnevu nā
sannula mŏnalu ninnu sādiṁchīnā
sannalu sesi tenĕ jaḍise vaṁtaḍilone
kannula teḍalu ninnum̐ garam̐giṁchīnā
(||lele||)
kelĕtti mŏkkidenu kĕrali yānavĕṭṭevu
vālārugoḽlu ninnu vaṁchugŏnīnā
melamulāḍidene mĕttanai vasivāḍevu
yela mām̐ṭalu marmamu lĕttibĕṭṭīnā
(||lele||)
yikkuva laṁṭidenu yiṭṭĕ nannu dūrevu
gakkuna kām̐gili ninnum̐ gaṭṭivesīnā
takkaga śhrīveṁkaḍeśha tagili nannelidivi
pĕkkulainaradulĕllā pĕḍarem̐sīnā