Ledu bhayamu maṟi kaadu bhavamu

లేదు భయము మఱి కాదు భవము
Language

(॥పల్లవి॥)
లేదు భయము మఱి కాదు భవము
ఆదియు నంత్యముఁ దెలి‌సిన హరియాజ్ఞే కాన

(॥లేదు॥)
తలఁపులు గడుగక వొడ లటు తాఁ గడిగిన నేమి
వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమఁ గలిగిన యాతఁడు
చెలఁగుచు పనులైనా సేసిన మరి యేమి

(॥లేదు॥)
పొంచినకోపము విడువక భోగము విడిచిననేమి
పంచేంద్రియములు ముదియక పై ముదిసిన నేమి
నించిన దైవము నమ్మిన నిర్భరుఁడయిన యాతఁడు
యెంచుక యేవర్గంబుల నెట్టుండిన నేమి

(॥లేదు॥)
వేగమె లోపల గడువక వెలి గడిగిన నేమి
యోగము దెలియక పలుచదువులు దెలిసిన నేమి
యీగతి శ్రీవేంకటపతి నెఱిఁగి సుఖించేటి యాతఁడు
జాగుల ప్రపంచమందును సతమైనా నేమి

(||pallavi||)
ledu bhayamu maṟi kādu bhavamu
ādiyu naṁtyamum̐ dĕli‌sina hariyājñe kāna

(||ledu||)
talam̐pulu gaḍugaga vŏḍa laḍu tām̐ gaḍigina nemi
vĕlubali kāṁkṣhalu vuḍugaga vidhuluḍigina nemi
alarusu śhrīharidāsyamu ādumam̐ galigina yādam̐ḍu
sĕlam̐gusu panulainā sesina mari yemi

(||ledu||)
pŏṁchinagobamu viḍuvaga bhogamu viḍisinanemi
paṁcheṁdriyamulu mudiyaga pai mudisina nemi
niṁchina daivamu nammina nirbharum̐ḍayina yādam̐ḍu
yĕṁchuga yevargaṁbula nĕṭṭuṁḍina nemi

(||ledu||)
vegamĕ lobala gaḍuvaga vĕli gaḍigina nemi
yogamu dĕliyaga palusaduvulu dĕlisina nemi
yīgadi śhrīveṁkaḍabadi nĕṟim̐gi sukhiṁcheḍi yādam̐ḍu
jāgula prabaṁchamaṁdunu sadamainā nemi