(॥పల్లవి॥)
లంకెలూడుటే లాభము యీ-
కింకరులను నలఁగెడికంటెను
(॥లంకె॥)
జంపులఁ జంపక సరుగనఁబాసేటి-
లంపటమేపో లాభము
కంపుమోపుతోఁ గనలి శరీరపు-
కొంపలోన వేఁగుట కంటెను
(॥లంకె॥)
యీవలనావల నేచేటిల యాసల-
లావు దిగుటెపో లాభము
యేవగింతలకు నిరవగు నరకపు-
కోవులఁబడి మునుఁగుటకంటెను
(॥లంకె॥)
తివిరి వేంకటాధిపుదాసులకృప-
లవలేశమెపో లాభము
చవులని నోరికి సకలము దిని తిని
భవకూపంబులఁ బడుకంటెను
(||pallavi||)
laṁkĕlūḍuḍe lābhamu yī-
kiṁkarulanu nalam̐gĕḍigaṁṭĕnu
(||laṁkĕ||)
jaṁpulam̐ jaṁpaga saruganam̐bāseḍi-
laṁpaḍamebo lābhamu
kaṁpumobudom̐ ganali śharīrabu-
kŏṁpalona vem̐guḍa kaṁṭĕnu
(||laṁkĕ||)
yīvalanāvala neseḍila yāsala-
lāvu diguḍĕbo lābhamu
yevagiṁtalagu niravagu naragabu-
kovulam̐baḍi munum̐guḍagaṁṭĕnu
(||laṁkĕ||)
tiviri veṁkaḍādhibudāsulakṛpa-
lavaleśhamĕbo lābhamu
savulani norigi sagalamu dini tini
bhavagūbaṁbulam̐ baḍugaṁṭĕnu