లలనల సఁ(సం?)తలోని లాబగాఁడవు
(॥పల్లవి॥)
లలనల సఁ(సం?)తలోని లాబగాఁడవు
తలఁచని తలఁపులు దైలువారె నిపుడు
(॥॥)
వేడుకతో నీవాపెపై వేసినపూవులచెండ్లు
తోడువచ్చి నిలుచున్నతొయ్యలిఁ దాఁకె
కూడాఁబట్టి యిద్దరిని గొబ్బునఁబెండ్లాడవయ్య
యీడనే నీబేర మొకటినుమడి యాయను
(॥॥)
చెలరేఁగి యాపెమీఁదఁ జిమ్మినట్టి పన్నీరు
మెలుపునఁ జెలికతైమీఁదఁ నిండెను
కలసి నీవిద్దరినిఁ గాఁగిలించుకొనవయ్య
వలపు లినుమడించి వడ్డి వచ్చె నీకును
(॥॥)
పిక్కటిల్ల నీవాపెపైఁ బెట్టినలువంటిసేస
పక్కన నూడిగపుతిపైఁ జిందెను
యిక్కువ శ్రీ వేంకటేశ యిట్టె నన్ను నేలితివి
మొక్కలాన నీమేలు ముయ్యడ నాఁగాయను
(||pallavi||)
lalanala sam̐(saṁ?)taloni lābagām̐ḍavu
talam̐sani talam̐pulu dailuvārĕ nibuḍu
(||||)
veḍugado nīvābĕbai vesinabūvulasĕṁḍlu
toḍuvachchi nilusunnadŏyyalim̐ dām̐kĕ
kūḍām̐baṭṭi yiddarini gŏbbunam̐bĕṁḍlāḍavayya
yīḍane nībera mŏgaḍinumaḍi yāyanu
(||||)
sĕlarem̐gi yābĕmīm̐dam̐ jimminaṭṭi pannīru
mĕlubunam̐ jĕligadaimīm̐dam̐ niṁḍĕnu
kalasi nīviddarinim̐ gām̐giliṁchugŏnavayya
valabu linumaḍiṁchi vaḍḍi vachchĕ nīgunu
(||||)
pikkaḍilla nīvābĕbaim̐ bĕṭṭinaluvaṁṭisesa
pakkana nūḍigabudibaim̐ jiṁdĕnu
yikkuva śhrī veṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
mŏkkalāna nīmelu muyyaḍa nām̐gāyanu