Lalana neegemtainaa laamtidaa yemi

లలన నీకెంతైనా లాఁతిదా యేమి
Language

(॥పల్లవి॥)
లలన నీకెంతైనా లాఁతిదా యేమి
తలఁపింత గలితే సంతసమాయ మాకును

(॥లల॥)
యెంత వేడుకొనుచు నీవేమి చెక్కులు నొక్కేవు
కాంతఁ బొత్తుకు రమ్మంటాఁ గాతరానను
చెంతనే బాలకిగాన సిగ్గుతో నుంటే నేమాయ
ఇంత నీకు బతైయితే నియ్యరాదా మోవి

(॥లల॥)
ఆన లేలపెట్టివు ఆసలేల చూపేవు
పూని పక్కఁ బండుమంటా పొంచి యాసతో
మానవతిగన చెలిమాఁటున నుంటే నేమాయ
కానీలే నీకు నిచ్చెతేఁ గాఁగిలియ్యరాదా

(॥లల॥)
కూడి యంత పెనఁగేవు గురుతులేల సే సేవు
వీడె మందుకొమ్మంటా వెక్కసానను
యాడనే శ్రీవేంకటేశ యేలితివి జవరాలి
వేడుకైతే నాకుచుట్టి వెలఁది కియ్యరాదా

(||pallavi||)
lalana nīgĕṁtainā lām̐tidā yemi
talam̐piṁta galide saṁtasamāya māgunu

(||lala||)
yĕṁta veḍugŏnusu nīvemi sĕkkulu nŏkkevu
kāṁtam̐ bŏttugu rammaṁṭām̐ gādarānanu
sĕṁtane bālagigāna siggudo nuṁṭe nemāya
iṁta nīgu badaiyide niyyarādā movi

(||lala||)
āna lelabĕṭṭivu āsalela sūbevu
pūni pakkam̐ baṁḍumaṁṭā pŏṁchi yāsado
mānavadigana sĕlimām̐ṭuna nuṁṭe nemāya
kānīle nīgu nichchĕdem̐ gām̐giliyyarādā

(||lala||)
kūḍi yaṁta pĕnam̐gevu gurudulela se sevu
vīḍĕ maṁdugŏmmaṁṭā vĕkkasānanu
yāḍane śhrīveṁkaḍeśha yelidivi javarāli
veḍugaide nāgusuṭṭi vĕlam̐di kiyyarādā