లక్ష్మీకల్యాణము లీలతోఁ బాడే మిదే నేము
(॥పల్లవి॥)
లక్ష్మీకల్యాణము లీలతోఁ బాడే మిదే నేము
లక్ష్మీనారాయణులే లలనయు నీవును
(॥లక్ష్మి॥)
చూపులు చూపులు మీకు సూసకము బాసికము
పూపుచన్నుగుబ్బ లివి బూజగుండలు
తీపులమోవితేనెలు తీరని మధుపర్కము
దాపుగఁ బెండ్లి యాడరయ్య తగుఁ దగు మీకును
(॥లక్ష్మి॥)
మాటలమీ కిద్దరికి మదనమంత్రములు
మేటితలఁబాలు మీలో మించు నవ్వులు
గాటమైన పులకలు కప్పురవసంతాలు
నీటునఁ బెండ్లాడరయ్య నెరవేరె మీకును
(॥లక్ష్మి॥)
కౌఁగిటి కౌఁగిలి మీకు కందువ పెండ్లి చవికె
పాఁగిన కోరికలే పావ కోళ్లు
ఆఁగిన శ్రీవేంకటేశ అలమేలుమంగా నీవు
వీఁగక పెండ్లాడడయ్య వేడుకాయ మీకును
(||pallavi||)
lakṣhmīgalyāṇamu līladom̐ bāḍe mide nemu
lakṣhmīnārāyaṇule lalanayu nīvunu
(||lakṣhmi||)
sūbulu sūbulu mīgu sūsagamu bāsigamu
pūbusannugubba livi būjaguṁḍalu
tībulamovidenĕlu tīrani madhubargamu
dābugam̐ bĕṁḍli yāḍarayya tagum̐ dagu mīgunu
(||lakṣhmi||)
māḍalamī kiddarigi madanamaṁtramulu
meḍidalam̐bālu mīlo miṁchu navvulu
gāḍamaina pulagalu kappuravasaṁtālu
nīḍunam̐ bĕṁḍlāḍarayya nĕraverĕ mīgunu
(||lakṣhmi||)
kaum̐giḍi kaum̐gili mīgu kaṁduva pĕṁḍli savigĕ
pām̐gina korigale pāva koḽlu
ām̐gina śhrīveṁkaḍeśha alamelumaṁgā nīvu
vīm̐gaga pĕṁḍlāḍaḍayya veḍugāya mīgunu