Lagiminaayaguraali lalivimdam bemdlaadi

లకిమినాయకురాలి లలివిూఁదఁ బెండ్లాడి
Language

(॥పల్లవి॥)
లకిమినాయకురాలి లలివిూఁదఁ బెండ్లాడి
వికవిక నవ్వీని విందు గదమ్మా

(॥లకిమి॥)
పసుపువన్నెచీర బలుకాశగాఁ గట్టి
పసురాకుదండ తలపై సుట్టి
మొసలిమొకముసొమ్ములు సెవులనుఁ బెట్టి
విసవిస నవ్వీని వీఁడు గదమ్మా

(॥లకిమి॥)
వాఁడిబిల్ల కత్తి వలచేతఁ బరిజించి
పోఁడిమి బాలసంకుపోఁచి నాడించి
ఆఁడుదానిపేరి మచ్చ అరుతనే సవరించి
వేఁడిన వరము లిచ్చీ వీఁడు గదమ్మా

(॥లకిమి॥)
కావరపు పెనుఁబాము గట్టు మీఁద నెక్కి
కావిరెక్కబొల్లిపిట్టఁ గైకొని యెక్కి
శ్రీవేంకటేశుఁడు సేసవెట్టి కూడెను
వేవేలు వేసాలవాఁడు వీఁడు గదమ్మా

(||pallavi||)
lagimināyagurāli laliviూm̐dam̐ bĕṁḍlāḍi
vigaviga navvīni viṁdu gadammā

(||lagimi||)
pasubuvannĕsīra balugāśhagām̐ gaṭṭi
pasurāgudaṁḍa talabai suṭṭi
mŏsalimŏgamusŏmmulu sĕvulanum̐ bĕṭṭi
visavisa navvīni vīm̐ḍu gadammā

(||lagimi||)
vām̐ḍibilla katti valasedam̐ barijiṁchi
pom̐ḍimi bālasaṁkubom̐si nāḍiṁchi
ām̐ḍudāniberi machcha arudane savariṁchi
vem̐ḍina varamu lichchī vīm̐ḍu gadammā

(||lagimi||)
kāvarabu pĕnum̐bāmu gaṭṭu mīm̐da nĕkki
kāvirĕkkabŏllibiṭṭam̐ gaigŏni yĕkki
śhrīveṁkaḍeśhum̐ḍu sesavĕṭṭi kūḍĕnu
vevelu vesālavām̐ḍu vīm̐ḍu gadammā