Kumdana(na?)pudatti gatti govimdaraaju samdi

కుందణ(న?)పుదట్టి గట్టి గోవిందరాజు సంది
Language

(॥పల్లవి॥)
కుందణ(న?)పుదట్టి గట్టి గోవిందరాజు సంది-
గొందుల సతులఁ గూడె గోవిందరాజు

(॥॥)
గోవులఁ గాచిననాఁటి గోవిందరాజు నేఁడు
కోవిదుఁడై వున్నవాఁడు గోవిందరాజు
కూవలు చేసీ వలపు గోవిందరాజు! పిల్లఁ-
గోవిలోనే మాటలాడీ గోవిందరాజు

(॥॥)
కుండలతోఁ బాలుదాగే గోవిందరాజు! నేఁడు
కొండంతదొరైనాఁడు గోవిందరాజు
కొండుకబాలులతోడ గొవిందరాజు! వుట్లు
కొండాటముగఁ గొట్టె గోవిందరాజు

(॥॥)
కొలనిలో ఆగడీఁడు గోవిందరాజు నేఁడు
కొలువు సేయించుకొనీ గోవిందరాజు
కొలఁదిమీర మమ్మేలె గోవిందరాజు మా
కొలమే శ్రీవేంకటాద్రి గోవిందరాజు

(||pallavi||)
kuṁdaṇa(na?)pudaṭṭi gaṭṭi goviṁdarāju saṁdi-
gŏṁdula sadulam̐ gūḍĕ goviṁdarāju

(||||)
govulam̐ gāsinanām̐ṭi goviṁdarāju nem̐ḍu
kovidum̐ḍai vunnavām̐ḍu goviṁdarāju
kūvalu sesī valabu goviṁdarāju! pillam̐-
govilone māḍalāḍī goviṁdarāju

(||||)
kuṁḍaladom̐ bāludāge goviṁdarāju! nem̐ḍu
kŏṁḍaṁtadŏrainām̐ḍu goviṁdarāju
kŏṁḍugabāluladoḍa gŏviṁdarāju! vuṭlu
kŏṁḍāḍamugam̐ gŏṭṭĕ goviṁdarāju

(||||)
kŏlanilo āgaḍīm̐ḍu goviṁdarāju nem̐ḍu
kŏluvu seyiṁchugŏnī goviṁdarāju
kŏlam̐dimīra mammelĕ goviṁdarāju mā
kŏlame śhrīveṁkaḍādri goviṁdarāju