కుందనపుఁ బిల్లఁగోవి గోపీనాథా । మాపైఁ
(॥పల్లవి॥)
కుందనపుఁ బిల్లఁగోవి గోపీనాథా । మాపైఁ
జిందేవు మోహరసాలు చిన్నిగోపీనాథ
(॥కుంద॥)
కొలనిలోపలిమాతో గోపీనాథా । యేల
కులికి నవ్వు నవ్వేవు గొపీనాథా
కొలువు మొక్కు మొక్కేము గోపీనాథా నీ
చలము చెల్లితేఁ జాలు జాణ గోపీనాథా
(॥కుంద॥)
గొబ్బన మాచీరలిమ్ము గోపీనాథా । మా
గుబ్బలపైఁ గాఁక రేఁగె గోపీనాధా
గుబ్బతిల్లీఁ దయకమే గోపీనాథా। నీ -
కబ్బితి మేమైన జేయవయ్య గోపీనాథా
(॥కుంద॥)
కుప్పవడె మాసిగ్గు గోపీనాథా। మా -
కొప్పు జారె ముడువుమా గోపీనాథా
వొప్పుగ శ్రీవేంకటాద్రినుండి వచ్చి కూడితివి
అప్ప తొండామారేగుళ్ల ఆదిగోపీనాథా
(||pallavi||)
kuṁdanabum̐ billam̐govi gobīnāthā | mābaim̐
jiṁdevu moharasālu sinnigobīnātha
(||kuṁda||)
kŏlanilobalimādo gobīnāthā | yela
kuligi navvu navvevu gŏbīnāthā
kŏluvu mŏkku mŏkkemu gobīnāthā nī
salamu sĕllidem̐ jālu jāṇa gobīnāthā
(||kuṁda||)
gŏbbana māsīralimmu gobīnāthā | mā
gubbalabaim̐ gām̐ka rem̐gĕ gobīnādhā
gubbadillīm̐ dayagame gobīnāthā| nī -
kabbidi memaina jeyavayya gobīnāthā
(||kuṁda||)
kuppavaḍĕ māsiggu gobīnāthā| mā -
kŏppu jārĕ muḍuvumā gobīnāthā
vŏppuga śhrīveṁkaḍādrinuṁḍi vachchi kūḍidivi
appa tŏṁḍāmāreguḽla ādigobīnāthā